Balakrishna- Pawan Kalyan: సినీ హీరోగా.. రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు టీవీ ప్రొగ్రాంను డెవలప్ చేయడంలోనూ ఆయన సత్తా చూపించాడు. ఓటీటీ వేదికగా సాగుతున్న ‘అన్ స్టాపబుల్’ షో కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో విజయవంతంగా సాగుతోంది. మొదట్లో కాస్త మాములుగా ఉన్నా.. ఇప్పుడు ‘అన్ స్టాపబుల్’ టాప్ రేటింగ్ లో ఉంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేసి వారి మనసు.లోని భావాలను బయటపెట్టడంలో బాలయ్య మంచి పట్టు సాధించారు. దీంతో ఈ షో ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవల అన్ స్టాపబుల్ 2 ప్రారంభమైన నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబును ఇంటర్వ్యూను చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రొగ్రాంకు మరింత ఊపు వచ్చింది. కానీ చాలా రోజుల నుంచి పవన్ కల్యాణ్ ను ‘అన్ స్టాపబుల్’లో చూడాలని కోరుతున్నారు.. తమ హీరోను పిలవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు… ఇంతకీ పవన్ కల్యాణ్ ఈ షో కు రాకపోవడానికి కారణమేంటి..?

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘ అన్ స్టాపబుల్’ సీజన్ 1 లో మోహన్ బాబు లాంటి సినీ రంగానికి చెందిన వారినే ఎక్కువగా ఆహ్వానించారు. దీంతో సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడి ఫాలోయింగ్ పెరిగింది. అయితే అప్పుడే కొందరు హీరోలు బాలకృష్ణతో కలిసి ఈ షోలో మాట్లాడని అనుకున్నారు. కానీ అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో కొందరు హీరోల ఫ్యాన్స్ తమ హీరోను ఇంటర్వ్యూ చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. పవన్ కల్యాన్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ‘త్వరలో అన్ స్టాపబుల్ షో కి పవన్’ అంటూ ఎడిటింగ్ చేసిన పిక్స్ పెడుతున్నారు. పవన్ ఈ షో కు వస్తే ఎంత బాగుండు.. అంటూ క్యాప్షన్ పెట్టీ మరీ వైరల్ చేస్తున్నారు. కానీ వారి కోరిక నెరవేరడం లేదు.
రీసెంట్ గా మాజీ సీఎం చంద్రబాబును షో కు ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య. ఇందులో బాబు రాజకీయ జీవితం గురించి అడిగి ప్రేక్షకులకు వినిపించారు. అంతేకాకుండా ఇందులో చంద్రబాబును బాలయ్య బావ అని పిలవడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో అన్ స్టాపబుల్ కు మరింత జోష్ పెరిగింది. చంద్రబాబే కాకుండా నారా లోకేశ్, తదితర రాజకీయ రంగానికి చెందిన వారిని కూడా షో కు పిలిచారు. అంటే ‘అన్ స్టాపబుల్-2’ లో ఎక్కువగా రాజకీయ నాయకులే సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మొదటి సీజన్లోనే ఈ షోకు వస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు వరుసగా రాజకీయ నాయకులు రావడంతో ఈసారి కచ్చితంగా వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అయితే పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయంగా బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ లాంటి సినిమాలు రన్ లో ఉన్నాయి. అటు ఏపీలో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. దీంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పవన్ బిజీగా మారారు. దీంతో ప్రస్తుతం ఈ షో కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్-ఎన్ బికే కలిస్తే ఇండస్ట్రీ షేక్ అవుతుందని ఆశిస్తున్నారు. మరి బాలయ్య పవన్ ను ఎప్పుడు..? ఎలా ..? తీసుకొస్తారో చూద్దాం..