Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక రామ్ చరణ్ ఎప్పుడైతే రాజమౌళి తో త్రిబుల్ ఆర్ సినిమా చేశాడో అప్పటినుంచి ఆయన స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఒక స్టార్ హీరోగా తనని తాను రిప్రజెంట్ చేసుకున్నాడు గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగాడు.
ఇక ఇలాంటి రామ్ చరణ్ తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కొద్దిరోజులు షూటింగ్ జరిగితే, మరి కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే శంకర్ దీనికి ప్యారాలల్ గా కమలహాసన్ తో ఇండియన్ 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో శంకర్ బిజీగా ఉండడం వల్ల గేమ్ చెంజర్ సినిమాలోని కొన్ని షాట్స్ ని వేరే డైరెక్టర్లతో తీయిస్తున్నాడు అనే టాక్ అయితే బయటకు వస్తుంది. ఇక ఈ విషయం మీద సైంధవ్ సినిమా డైరెక్టర్ అయిన శైలేష్ కొలన్ స్పందిస్తూ ఈ సినిమాలో తను కొన్ని షాట్స్ తీసినట్టుగా స్వయం గా అతనే చెప్పాడు.
అయితే అవి ఎలాంటి షాట్స్ అంటే ఆర్టిస్టులు ఎవరు లేకుండా చేసే షాట్స్ వాటిని ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్ అంటారు. రోడ్డుమీద వెహికల్స్ ఉన్నప్పుడు డ్రోన్ తో చేసే షాట్స్, అలాగే వైడ్ యాంగిల్ షాట్స్ లాంటివి షూట్ చేశారు.అయితే ఈ షాట్స్ ని శైలేష్ ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది అంటే ఈ సినిమా షూటింగ్ చేస్తున్న లొకేషన్ టైం అనేది అయిపోవడంతో శంకర్ చెన్నైలో ఉండడం వల్ల ఆయన వచ్చి ఆ షాట్స్ తీయడానికి లేట్ అవుతుంది.
కాబట్టి ప్రొడ్యూసర్ దిల్ రాజు తో మంచి డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ తీసి పెట్టమని శంకర్ చెప్పాడు. ఇక దాంతో దిల్ రాజు శైలేష్ ని సంప్రదించి ఆయనతో ఆ షాట్స్ తీయించాడు ఇక ఈ విషయాన్ని తనే చెప్పాడు. అయితే చాలా మంది డైరెక్టర్లు టైం సేవ్ అవ్వడానికి అలాంటి షాట్స్ ని తన అసిస్టెంట్స్ తో తీయిస్తు ఉంటారు. అని శైలేష్ చెబుతూనే చిన్నప్పటి నుంచి శంకర్ గారి సినిమాలు చూస్తూ పెరగడం వల్ల ఆయన మీద నాకు విపరీతమైన అభిమానం ఉందని ఈ సినిమాలో చిన్న షాట్స్ నేను తీయడం నిజంగా నా అదృష్టం అని ఆయన ఆ విషయం చెబుతూ మురిసిపోయారు…