PA Ranjith: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు చేసే సినిమాలు రియలెస్టిక్ గా ఉంటాయి. నిజ జీవితంలో మనం ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు సినిమాలు గా చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎంతమంది ఎన్ని సినిమాలు చేసినా కూడా పా రంజిత్ లాంటి దర్శకుడు చేసే సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే దాన్ని కులానికి సంబంధించిన కథగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆయన అదే చూపించే ప్రయత్నం చేస్తూ రావడం వల్లే కొందరు అతని సినిమాలను చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ప్రతి సినిమాలో తక్కువ కులంవల్లను ఎక్కువ కులం వాళ్ళు ఎలా తొక్కలని చూస్తున్నారు అనేదే ఆయన స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఇక ఆర్య హీరోగా చేసిన ‘సారపట్ట పరంపర’ మూవీలో కూడా అదే చూపించాడు.
ఇక రజనీకాంత్ తో చేసిన కబాలి, కాలా లాంటి సినిమాలు కూడా అందుకు అతీతమైతే కాదు. ఈ సినిమాల్లో కూడా తక్కువ కులానికి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అందుకని ఆయన ప్రతి సినిమాలో అలా కులానికి సంబంధించిన సన్నివేశాలను పెడతాడు. అనే విషయం మీద చాలా మందికి చాలా డౌట్లైతే ఉన్నాయి… కొంతమంది ఆయన సమాజంలో ఎదుర్కొన్న సమస్యలను తెరమీద చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడని చెబుతుంటే మరి కొంతమంది మాత్రం అతనికి పైత్యం ఎక్కువగా ఉంది.
దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. ప్రతి కథలో అలా కులానికి సంబంధించిన సీన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమాలో డిఫరెంట్ కంటెంట్ ఉంటే బాగుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇక విక్రమ్ తో చేసిన తంగలాన్ కూడా ఆయన కులానికి సంబంధించిన విషయాలను చూపించే ప్రయత్నం చేశాడు…
మంచి సినిమాలు చేస్తారనే పేరు ఉన్న పా రంజిత్ ప్రతిసారి ఇలానే చేయడం పట్ల పలువురు సినిమా మేధావులైతే కొంతవరకు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అందుకే పా రంజిత్ కి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం లేదు. అందుకే చిన్న హీరోలతోనే అతను సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం…