Telugu Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగేది. కానీ ఎప్పుడైతే రాజమౌళి ‘బాహుబలి’ సినిమా చేశాడో అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా ముందుకు దూసుకెళ్తుంది. ఇక దాంతో పాటుగా తెలుగు హీరోలు సైతం భారీ సక్సెస్ లను సాధిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు హీరోలకి ఇండియాలో తిరుగులేదని చెప్పాలి. వాళ్ళ సినిమా కోసం ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆసక్తి ఎదురు చూస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇంతకు ఆ ఇద్దరు తెలుగు హీరోలేవారంటే ఒకరు ప్రభాస్ కాగా, మరొకరు అల్లు అర్జున్ కావడం విశేషం…
ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వచ్చాడు. అతని ఫెయిల్యూర్ సినిమాలకు సైతం భారీ కలెక్షన్స్ వచ్చాయంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా వచ్చిన రాజాసాబ్ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికి ఆ సినిమా 60% అమౌంట్ ను రికవరీ చేయగలిగిందంటే మామూలు విషయం కాదు…
ఇక అల్లు అర్జున్ సైతం పుష్ప, పుష్ప 2 సినిమాలతో భారీ రికార్డులను క్రియేట్ చేశాడు. ఇండియాలో ఉన్న హీరోలందరిని వెనక్కి నటి తను ముందు వరుసలోకి దూసుకొచ్చాడు. ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా ప్రభాస్ పేరు మీద ఉన్న అన్ని రికార్డులను తన పేరు మీదికి షిఫ్ట్ చేసుకున్నాడు…
ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో మరోసారి పాన్ ఇండియా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నాడు… ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ క్రేజ్ చూసిన బాలీవుడ్ హీరోలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది…ఇక మొత్తానికైతే మన స్టార్ హీరోల సినిమాలను బ్రేక్ చేయగలిగే మూవీస్ ను బరిలోకి దింపాలనే ప్రయత్నంలో బాలీవుడ్ హీరోలు ఉన్నారు…
