Vicky Kaushal
Vicky Kaushal : ఇండస్ట్రీ లో టాలెంట్ ఉన్నవన్నీ ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరూ ఇది చేసిన కూడా వాళ్ళు తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నమైతే చేస్తారు… ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ముగిసిపోయిందనే చెప్పాలి. యంగ్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఇదే ధోరణిలో ముందుకు సాగితే మాత్రం ఖాన్ త్రయానికి చెక్ పెడుతూ చాలా మంది గొప్ప హీరోలు వెలుగులోకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…
ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి షారుక్ ఖాన్(Sharukh Khan), అమీర్ ఖాన్ (Ameer Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan) లాంటి నటులు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే విక్కీ కౌశల్ ప్రస్తుతం స్టార్ హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీ మీద తన మార్క్ ను చూపిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ కొడుకు ఆయన శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛావా అనే సినిమా చేసి ప్రశంసలను అందుకుంటున్నాడు… ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కత్రినా కైఫ్ (Katrina Kaif) ని తను 2021 డిసెంబర్ 9వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. కత్రినా కైఫ్ అంటే తనకు చాలా ఇష్టమని తన అభిమాన నటి అని చాలా సందర్భాల్లో తెలియజేసిన విక్కీ కౌశల్ (Vicky Koushal) ఎవ్వరికి తెలియకుండా సడన్ గా పెళ్లి చేసుకున్నాడు.
అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి మంచి పరిచయమైతే ఉండడంతో ఇద్దరి అభిరుచులు కలిసి ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నట్టుగా తెలిసింది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా కూడా రాలేదు. నిజానికి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ కంటే ఐదు సంవత్సరాలు పెద్దది అయినప్పటికి తన అభిమాన నటిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే విక్కీ కౌశల్ అలా చేశాడని తెలుస్తుంది.
మరి ఏది ఏమైనా కూడా కత్రినా కైఫ్ ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఇంకా ఇప్పుడు విక్కీ కౌశల్ సైతం భారీ రేంజ్ లో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త తరం అనేది స్టార్ట్ అయింది. ఇక ఖాన్ త్రయానికి స్వస్తి చెబుతూ యంగ్ హీరోలు అక్కడ స్టార్లుగా మారే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక విక్కీ కౌశల్ సైతం ఛావా సినిమాతో వందల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాడు. ప్యూచర్ లో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే హీరో అతనే అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సినిమా సినిమాకి తన నటనలోని వేరియేషన్స్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకే ఆయన అంటే చాలామంది ప్రేక్షకులు అభిమానాన్ని చూపిస్తూ అతనికి ఫ్యాన్స్ గా మారిపోతున్నారు…