The Boy And The Heron: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆ క్షణాలు వచ్చేశాయి. లాస్ ఏంజెల్స్ వేదికగా డాల్బీ థియేటర్ లో ఆస్కార్క్ అవార్డు వేడుకలు జరిగాయి. ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న విజేతలు వేదికపై మెరిశారు. అకాడమీ వేడుకలకు నాలుగోసారి జిమ్మి కిమేల్ హోస్ట్ గా వ్యవహారించారు.
ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘ది బాయ్ అండ్ ది హెరాన్’ అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. ది బాయ్ అండ్ ది హెరాన్ అనే చిత్రం జపాన్ కు చెందిన చిత్ర నిర్మాతల్లో ఒకరైన హయావో మియాజాకి రూపొందించారు. ఈ చిత్రం 2023లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను రాబట్టింది.
జపనీస్ యానిమేటేడ్ ఫాంటసీ చిత్రంగా వచ్చిన ది బాయ్ అండ్ ది హెరాన్ ను స్టూడియో ఘిబ్లీ నిర్మించారు. జపనీస్ వాయిస్ కాస్ట్ లో మసాకి సుడా, కొ షిబాసాకి, సోమ శాంటోకి, యోషినో కిమురా ఉన్నారు. పసిఫిక్ యుద్దం జరిగిన సమయంలో మహితో మాకి అనే బాలుడు చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. తల్లి మరణం తరువాత కొత్త ఇంటికి వెళ్లిన బాలుడు పాడుబడిన టవర్ ను కనుగొంటాడు. తరువాత మాట్లాడే గ్రే హెరాన్ తో అద్భుత ప్రపంచంలోకి ప్రవేశించడం సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.
1979 లో అరంగేట్రం చేసిన హయావో మియాజాకి …1985 లో స్టూడియో ఘిబ్లీని స్థాపించింది. అంతేకాదు యానిమేషన్ పరిశ్రమను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన రూపొందించిన ది బాయ్ అండ్ ది హెరాన్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పురస్కారాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.