Rajamouli – Vinayak : సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎదగాలని చాలామంది ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే సినిమాలు చేసి డైరెక్టర్లుగా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. ముఖ్యంగా అలాంటి వాళ్ళలో పూరి జగన్నాధ్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
అందులో భాగంగానే ఆయన కెరియర్ లో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఎవరు పడలేని ఇబ్బందులను పడడమే కాకుండా ఎవరూ ఓర్చుకోలేని దెబ్బలను కూడా తిన్నాడు. మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఓపిక పట్టుకొని ముందుకు నడిచాడు కాబట్టే ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఓపిక అనేది చాలా ముఖ్యమని పూరి జగన్నాధ్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు గానీ, నటులు గాని, నిర్మాతలు గాని అందరూ పూరి జగన్నాథ్ కి అభిమానులుగా మారడానికి కారణం ఆయనలోని తెగువ అనే చెప్పాలి.
ఎక్కడ పడ్డామో అక్కడే గెలిచి చూపించాలి అనే తెగువ ఆయనలో ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఆయన డైరెక్టర్ గా అవ్వడమే కాకుండా చాలామంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఇక ముఖ్యంగా ఆయనలోని తెగింపు గుణం చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలవడమే కాకుండా ఆయనను చూసి చాలామంది ఇండస్ట్రీకి డైరెక్టర్లు అవుదామని వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు.ఇక మొత్తానికైతే పూరి ప్రస్తుతం కొంచెం డౌన్ ఫాల్ అయినప్పటికీ మరోసారి తన పంజా దెబ్బ తో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
రాజమౌళి, వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా పూరి జగన్నాథ్ అభిమానులుగా మారిపోయారు అంటే ఆయన వ్యక్తిత్వం గానీ, ఆయన సినిమాలు తీసే విధానం గాని ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు… ఆయన సినిమాల్లో హీరో ఎంతో జోవియల్ గా ఉంటాడో బయట కూడా పూరి అంతే జోవియాల్ గా ఉంటాడని అతని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అతను ఏ ప్రాబ్లమ్ ను కూడా మైండ్ దాకా తీసుకోడు. వచ్చిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మాత్రం ఆలోచిస్తాడు తప్ప ప్రాబ్లం ని మైండ్ లో పెట్టుకొని ఇబ్బంది పడడం ఆయనకు నచ్చదు. అదే ఆయనకి ప్లస్ పాయింట్ అంటూ చాలామంది ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు…