Puri Jagannadh: టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అని చెప్పుకుంటూ ఉంటాం… ఎందుకంటే ఆయన తీసిన సినిమాలను అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. డెప్త్ డైలాగులతో ఆడియెన్స్ ని రెండున్నర గంటల పాటు కదలకుండా కూర్చోబెట్టగల సత్తా ఉన్న డైరెక్టర్ అలాగే ఈయనకి యూత్ లో ఉన్న క్రేజ్ మరే హీరో కి లేదు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అని వాళ్లే చెప్తూ ఉంటారు.ఇక పూరి జగన్నాథ్ నాగార్జున తో చేసిన శివమణి సినిమా తర్వాత వెంకటేష్ తో ఒక గ్యాంగ్ స్టర్ మూవీ చేద్దామని అనుకున్నాడు.
అలాగే వెంకటేష్ కి కూడా కథ వినిపించాడు. అయితే ఈ స్టోరీలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ కావడంతో అంతకు ముందే ఆయన ఘర్షణ సినిమా చేసి ఉండడం వల్ల బ్యాక్ టు బ్యాక్ అవే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేక ఆ స్టోరీని వెంకీ రిజెక్ట్ చేశాడు. వేరే కథ ఏదైనా ఉంటే చేద్దామని చెప్పడంతో పూరి సరేనని అక్కడి నుంచి బయటికి వచ్చేసి బ్యాంకాక్ వెళ్లి పోకిరి కథ రాసుకొని వచ్చి మహేష్ బాబుతో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు… అలా వెంకటేష్ జగన్నాథ్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా రాకుండా పోయింది.ఇక తర్వాత కూడా వీళ్ళు కాంబినేషన్ లో సినిమా అనేది రాలేదు.
ఇక ప్రస్తుతం వెంకటేష్ శైలేష్ కొలన్ డైరెక్షన్ లో సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక పూరి జగన్నాథ్ రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇలా ప్రస్తుతానికి ఇద్దరు కూడా బిజీగా గడపడంతో ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియడం లేదు. నిజానికి పూరి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో కనక హిట్ కొడితే పూరి, వెంకటేష్ కాంబో లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే వెంకటేష్ కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కానీ వీళ్ళ కాంబినేషన్ అనేది సెట్ కావడం లేదు. ఇక అన్ని కుదిరితే మరో కొద్ది రోజుల్లో వీళ్ళ కాంబినేషన్ అన్నది పట్టాలెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది మాత్రం చెప్పడం కష్టమవుతుంది…