https://oktelugu.com/

Manchu Vishnu Wife: మంచు విష్ణు భార్య ఎందుకు చీరల బిజినెస్ పెట్టింది? మృణాల్ ఠాకూర్ కి కూడా అమ్మిందా?

మంచు విష్ణు భార్య చీరల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిందనే సమాచారం అందుతోంది. మంచు ఫ్యామిలీ సినిమాలు లేక అయోమయంలో పడితే.. మంచు కోడలు కొత్త వ్యాపారంలో కాలు పెట్టడంతో ఇది వారికి కలిసి రావాలని కోరుకుంటున్నారు మంచు ఫ్యామిలీ అభిమానులు.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 9, 2023 / 05:02 PM IST
    Follow us on

    Manchu Vishnu Wife: యాం. హీరోహీరోయిన్ లు ఎంత మంచి సక్సెస్ సాధించినా కొన్నేళ్ల తర్వాత ఇతర బిజినెస్ లోనూ లేదో మరో పనిలో బిజీ అయిపోతుంటారు.ఇక హీరోయిన్ లు అయితే వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటారు. మరికొంత మంది వ్యాపారవేత్తలే హీరోలను పెళ్లి చేసుకుంటారు. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒకలా జరుగుతుంటుంది. అయితే ప్రతి ఒక్కరికీ చిత్ర పరిశ్రమలో ఎల్లప్పుడు సినిమాల్లో ఛాన్స్ రావడం కష్టమే అని చెప్పాలి. అచ్చం ఇలాంటి ఇబ్బందినే మంచు ఫ్యామిలీ ఎదుర్కొంటోంది. వారికి అవకాశాలు లేక అయోమయంలో పడ్డారు. చేసిన అరకొర సినిమాలు కూడా పెద్ద హిట్ టాక్ ను ఇవ్వలేకపోయాయి.

    వా.1..టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు విష్ణు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మోసగాళ్లు, జిన్నా సినిమాలు ఫ్లాప్ కావడంతో మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదు. మంచు ఫ్యామిలీ గతంతో పోల్చి చూస్తే సినిమాల విషయంలో చాలా నెమ్మదించారనే చెప్పాలి. వీరికి పెద్దగా ఆఫర్లు రావడం లేదని సినీ ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే మంచు విష్ణు భార్య చీరల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిందనే సమాచారం అందుతోంది.
    మంచు ఫ్యామిలీ సినిమాలు లేక అయోమయంలో పడితే.. మంచు కోడలు కొత్త వ్యాపారంలో కాలు పెట్టడంతో ఇది వారికి కలిసి రావాలని కోరుకుంటున్నారు మంచు ఫ్యామిలీ అభిమానులు. అయితే ఈ అందాల బొమ్మ చీరల బిజినెస్ లో సక్సెస్ అవుతుందో లేదో కానీ.. చీరల ఖరీదు మాత్రం ఎక్కువగా ఉంది. ఒక చీర ఖరీదు కనీసం 20 లక్షల రూపాయలు ఉంటుందని టాక్. దీంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

    ఒక్కో చీరను డిజైన్ చెయ్యడానికి ఏకంగా 75 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. విరానికా ఈ వ్యాపారానికి “విరానికా బ్రైడల్ కలెక్షన్” అని పేరు పెట్టారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు ఇప్పటికే పలు వ్యాపారాలలో సక్సెస్ అయ్యారు. విరానికా కూడా పలు బిజినెస్ లలో సక్సెస్ సాధించింది. అటు చీరల వ్యాపారంలో కూడా విరానికా సక్సెస్ అయితే ఆమెకు కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ఇక ఈమె విక్రయించే చీరలలో ఒక్కో చీర తయారు చేయడానికి ఏకంగా 75 రోజుల సమయం పడుతుంది.. దీంతో వాటి ఖరీదు కూడా వేలల్లో ఉంటుంది. అయితే ఈ ఎంబ్రాయిడరీ పట్టు చీరలను చేతితో డిజైన్ చేస్తారని తెలుస్తోంది.

    మృణాల్ ఠాకూర్ ధరించిన చీర..
    సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ధరించిన శారీ తన బ్రైడల్ కలెక్షన్ కు చెందిన శారీ అని తెలిపింది విరానికా. ఆ శారీ తయారు చేయడానికి ఏకంగా 980 గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందట. దీంతో మరోసారి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతు అయింది. అటు మంచు విష్ణు కుటుంబానికి ప్రముఖ సెలబ్రిటీలతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఈ బిజినెస్ లో ఆమె సక్సెస్ కావడం సులువేనని తెలుస్తోంది. విరానికా ఇలా ఉంటే..మంచు మనోజ్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు. మొత్తం మీద సినిమాల్లో అవకాశాలు లేవనే బాధ కంటే వారు బిజినెస్ లో బిజీగా ఉన్నారనే సమాచారం అభిమానులను ఆనంద పెడుతోంది. సినిమాల్లో ప్రతి సారి అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. దీంతో మరో సైడ్ బిజినెస్ లు మెయింటెన్ చేయడం.. అందులో మెలుకువలు సాధిస్తూ.. సంపాదించడం ఉత్తమమం అని తెలుస్తోంది..