Selvaraghavan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్.. ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైతే ఉంటుంది. ఇక ధనుష్ వాళ్ళ అన్నగా కూడా ఈయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా 7/g బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, యుగానికి ఒక్కడు లాంటి సినిమాలు ఆయన కెరియర్ని చాలా ఉత్తమమైన స్థానంలో నిలుపాయనే చెప్పాలి…ఇక ఈయన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేశన్ కనక మనం చూసుకున్నట్లైతే చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా చాలా డిఫరెంట్ వేలో ప్రాజెక్ట్ అవుతూ ఉంటాయి… ఎలా అంటే సిన్సియర్ గా ఉన్న అమ్మాయి జీవితంలోకి హీరో ఎంట్రీ ఇచ్చి ఆమె జీవితాన్ని ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో పడేస్తూ ఉంటారు. అందువల్లే ఈయన సినిమాలో హీరో క్యారెక్టర్ కంటే హీరోయిన్ పాత్రకి చాలా ఎక్కువ వెయిట్ అనేది ఉంటుంది. అలాగే ఆ పాత్ర మీదనే సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది.
అందుకే తను క్యారెక్టర్స్ ని చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు… 7/జీ బృందావన కాలనీ సినిమాను కనక చూసుకుంటే సాఫీగా సాగిపోతున్న హీరోయిన్ కెరియర్ లోకి హీరో వచ్చి ఆమెని డిస్టర్బ్ చేస్తాడు. అలాగే ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో హీరోయిన్ త్రిష వాళ్ళ బావని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ మధ్యలో వెంకటేష్ వచ్చి ప్రేమ వ్యవహారాలు అంటూ అతని మూడ్ ని డైవర్ట్ చేసి తన వైపు తిప్పుకుంటాడు. ఇక అలాగే తమిళంలో ధనుష్ సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్ల గా వచ్చిన ‘కాదల్ కొండెన్’ సినిమా కూడా ఇలాంటి కథతోనే తెరకెక్కింది.
ఇక ఈ సినిమాని తెలుగు లో అల్లరి నరేష్ ‘నేను ‘ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో ఎవరూ పట్టించుకోని ఒక హీరో క్యారెక్టర్ ని హీరోయిన్ దగ్గరికి తీసుకుని ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తుంటే ఆ వ్యక్తి మాత్రం దానిని ప్రేమ గా భావించి ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రేమలో ఉన్న వ్యక్తిని చంపేయాలని చూస్తుంటాడు.
ఇక సైకలాజికల్ గా డిఫరెంట్ వే లో తెరకెక్కించడంలో సెల్వ రాఘవన్ చాలా సిద్ధహస్తుడనే చెప్పాలి. సెల్వ రాఘవన్ రాసుకున్న ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్ మోటివ్ తో కనిపిస్తూ ఉంటుంది…అందుకే ఆయన సినిమాలు అయితే సూపర్ సక్సెస్ అవుతావ్, లేదంటే ప్లాప్ అవుతాయి…