Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఆయన ఏది చేసిన సంచలనంగానే మారుతోంది. ఆయన చేసిన సినిమాలు అతనికి మేకింగ్ విషయంలో చాలా మంచి పేరు తీసుకువచ్చి పెట్టాయి. ఇప్పటివరకు ఆయన 3 సినిమాలు చేసినప్పటికి అవన్నీ కూడా అతని ఇమేజ్ ను పెంచాయే తప్ప తగ్గించలేదు. ఇక అదే ఊపు లో ఆయన వరుస సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ సందీప్ రెడ్డి వంగ వాటిని కొట్టిపారేశాడు. ఇక ఇప్పుడు రన్బీర్ కపూర్ ఈ సినిమాలో భాగమవ్వబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇంతకు ముందు రన్బీర్ కపూర్ సైతం సందీప్ యూనివర్స్ భాగంగా స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తే తను కూడా స్పిరిట్ లో నటించే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా హింట్ ఇచ్చాడు.
దాంతో ప్రతి ఒక్కరు రన్బీర్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలను హైలైట్ చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటులకు చాలా మంచిస్కోప్ ఉంటుంది. వాళ్ల నటనతో హైలైట్ అవ్వడమే కాకుండా భారీ క్రేజ్ ను కూడా సంపాదించుకుంటారు. అందుకే అతని సినిమాలో నటించడానికి చాలామంది నటీనటులు ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక అలాంటి సందీప్ స్టార్ కాస్టింగ్ కోసం ఆరాటపడడు. తన పాత్రకి ఎవరైతే సరిపోతారో వాళ్లను మాత్రమే తన సినిమాలో పెట్టుకోవాలని చూస్తుంటాడు. స్పిరిట్ సినిమాలో పాత్ర కోసం కొరియన్ నటుడు అయిన డాన్ లీ ని తీసుకొస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ పాత్ర కి ఆయన కావాలి కాబట్టి అతన్ని తీసుకొస్తున్నాడు. లేకపోతే వేరే వాళ్ళతో చేయించేవాడు. ఇక అనిమల్ సినిమాలో చాలా మంది నటులు నటించడానికి ఆసక్తి చూపించిన కూడా ఫేడ్ ఔట్ లో ఉన్న బాబీ డియోల్ ని తీసుకొచ్చి అతనికొక లైఫ్ ఇచ్చాడు.
ఇక త్రిప్తి డిమ్రి పరిస్థితి కూడా అంతే అనిమల్ సినిమాకి ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా అవేవి సక్సెస్ ని సాధించలేదు. ఒక్కసారి అనిమల్ లో కనిపించింది. ఆ సినిమాతో సక్సెస్ ని సాధించింది. అలాగే వరుస ఛాన్స్ లను అందుకుంది. ఏకంగా స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం… అందుకే సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో నటించడానికి నటులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు…