Prabhas Vs Shah Rukh Khan: సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఇప్పటికే బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ మరోసారి సలార్ సినిమాతో తన సత్తా చాటడానికి ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లను కలెక్ట్ చేసిన ప్రభాస్ ఇక ఇప్పుడు ఈ సినిమాతో కూడా భారీ కలక్షన్స్ ని రాబడుతాడు అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక భారీ రేంజ్ లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగనున్నట్టు గా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ తో ఒక్కసారిగా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరిగాయి. ఈ ఒక్క సాంగ్ తో దాదాపు ప్రేక్షకులు అందరు కూడా సలార్ సినిమా మీద మంచి ఇంప్రెషన్ అయితే పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే సలార్ కి పోటీగా షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న డాంకి సినిమా ఈనెల 21 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ప్రభాస్ సినిమాకి పోటీగా షారుక్ ఖాన్ తన సినిమాని దింపుతున్నాడు అంటూ బాలీవుడ్ లో కూడా విపరీతమైన చర్చలు అయితే నడుస్తున్నాయి.ఇక మొత్తానికి సలార్ సినిమాకి డాంకి సినిమాకి మధ్య పోటీ అయితే బీభత్సంగా నడుస్తుంది.
అయితే రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ బరిలో సక్సెస్ అవుతుంది ఏ సినిమా ప్లాప్ అవుతుంది అనే దానిమీద ఇప్పటికే అభిమానులు విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు ప్రభాస్ సినిమాని పొగుడుతూ పబ్లిసిటీ చేస్తుంటే, షారుఖాన్ అభిమానులు అతన్ని పొగుడుతూ ఆయన్ని విపరీతమైన వైరల్ చేస్తున్నారు. ఇక ఇద్దరు స్టార్ హీరోల మధ్యలో బాక్సాఫీస్ వార్ అనేది జరగనున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే…
అయితే ప్రభాస్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ప్రభాస్ స్టార్ డం అనేది తార స్థాయి కి చేరుకుంటుంది. అలాగే ప్రశాంత్ నీల్ కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు. అందుకే ఈ సినిమా సక్సెస్ అనేది ఇద్దరికీ చాలా ముఖ్యం అనే చెప్పాలి…ఇక ఈ సినిమాతో సక్సెస్ ఇస్తే ప్రభాస్ అభిమానులు కూడా చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు…