Jabardasth: తెలుగు రాష్ట్రాల్లో కామెడీ షో అంటే జబర్దస్త్ పేరే చెబుతారు. ఎందుకంటే అంతలా పాపులర్ అయింది ఆ షో. ఇక కామెడీ పరంగా కంటెస్ట్ పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎప్పుడు పాత కొత్తల కలయికతోనే జబర్దస్త్ ఎప్పుడు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. మొదట నాగబాబు, రోజాలు జడ్జిలుగా వ్యవహరించేవారు. తరువాత కాలంలో నాగబాబు స్థానంలో మనో వచ్చారు. రోజురోజుకు జబర్దస్త్ షో కొత్తదనంతో ముందుకు వెళ్తోంది.

జబర్దస్త్ లో ఇన్నాళ్లు జడ్జిగా వ్యవహరించిన రోజాకు ప్రస్తుతం మంత్రి స్థానం లభించింది. ఎన్నో ఏళ్లుగా ఆమె కన్న కలలకు ఇప్పుడు రూపం వచ్చింది. దీంతో ఆమె జబర్దస్త్ షో నుంచి తప్పకుంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి జడ్జి ఎవరనే దానిపై ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది. కొందరు ఆమనిని పిలుస్తారని అంటే మరికొందరు ఇంద్రజ అని చెబుుతున్నారు. మొత్తానికి జడ్జి స్థానానికి పోటీ పడే వారెవరో ఇంకా తెలియడం లేదు.
Also Read: KGF 2′ Movie Review:`కేజీఎఫ్ 2′ రివ్యూ
ఇటీవల ఓ సెలబ్రిటీ పేరు వార్తల్లో చక్కర్లు కొడుతోంది. ఆ మధ్య ఎగిరేపావురమా, పెళ్లి చేసుకుందాం వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ లైలాను జడ్జిగా తీసుకొస్తారనే వాదన కూడా వస్తోంది. అయితే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె ఒప్పుకుంటుందో లేదో అనే సందేహాల మధ్య ఆమె ఎన్నిక గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జబర్దస్త్ కు ఇన్నాళ్లు జడ్జిగా వ్యవహరించిన రోజా కార్యక్రమ విజయవంతంలో తనదైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ మధ్యకాలంలో ఆమని కూడా అప్పుడప్పుడు వస్తుండటంతో ఆమెను తీసుకుంటారో అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇంకా ఇంద్రజ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జిగా వ్వవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి జబర్దస్త్ షో ను నడిపించే జడ్జి కోసం మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియడం లేదు. ప్రతి షోలో రోజా తన నవ్వులతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే జడ్జి కూడా అంతటి కళతో అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జబర్దస్త్ షోను మరింత రంజింప చేయాలనే ఉద్దేశంతో మల్లెమాల ఉన్నట్లు సమాచారం. అందుకే ఎవరు ప్రతిభ ప్రదర్శిస్తే వారికి సముచిత స్థానం ఇస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఆది ఒకరని తెలిసిందే. దీంతో జడ్జిల్లో కూడా మంచి జడ్జిమెంట్ ఇస్తూ కళాకారులను ఆకట్టుకునే విధంగా ఉండేందుకు అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జబర్దస్త్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను కనువిందు చేస్తోంది.
Also Read:MIM Akbaruddin: విద్వేష వ్యాఖ్యలు.. ‘అక్బరుద్దీన్’ సేఫ్… అసలేం జరిగింది? ఎందుకు వీగిపోయింది?