https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ మీద నెగటివ్ కామెంట్లు చేస్తుంది ఎవరు..?పుష్ప 2 తో వాళ్ళకి సమాధానం చెబుతాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఒకప్పుడు అసలు హీరో గానే పనికిరాడు అని అందరూ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఐకాన్ స్టార్ గా కూడా గుర్తింపు పొందుతున్నాడు.

Written By: , Updated On : November 25, 2024 / 12:13 PM IST
Who will make negative comments on Allu Arjun..? Will he answer them with Pushpa 2..?

Who will make negative comments on Allu Arjun..? Will he answer them with Pushpa 2..?

Follow us on

Allu Arjun :  సినిమా ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఒకప్పుడు అసలు హీరో గానే పనికిరాడు అని అందరూ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఐకాన్ స్టార్ గా కూడా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ప్రస్తుతం ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగాడు…

స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు అల్లు అర్జున్…ఈయన ‘పుష్ప ‘ సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన విషయం మనకు తెలిసిందే. ఆ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఇంప్రెస్ చేసిన ఈ స్టార్ హీరో ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 5వ తేదీన ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి ఆయన తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకొస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన మీద కొంతమంది నెగటివ్ కామెంట్లైతే చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ అయితే చేయడం లేదు. కానీ ఇలాంటి సందర్భంలో పుష్ప 2 సినిమా మీద కొంతవరకు నెగటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తూ అల్లు అర్జున్ మీద బ్యాడ్ కామెంట్లను చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని రకాల పోస్టులను చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతుండటం విశేషం… అయితే ఈ కామెంట్లన్నీ పవన్ కళ్యాణ్ అభిమానులే చేస్తున్నారు అంటు మరికొంత మంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేసినప్పటికి అల్లు అర్జున్ మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక పుష్ప 2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటూ తను చాలా బిజీగా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.

ఇంకో పది రోజుల్లో పుష్ప 2 సినిమా రిలీజ్ ఉన్న నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవడమే కాకుండా ఇతర భాషల్లో కూడా తన ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ లో చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియాలో కూడా స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక గత కొన్ని రోజుల క్రితం నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులకి అల్లు అర్జున్ అభిమానులకి మధ్య కొన్ని విబేధాలు తలెత్తుతున్నాయి.

మరి వాటిని పట్టించుకోకుండా అల్లు అర్జున్ ఈ సినిమా మీదనే పూర్తి ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నాడు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా కూడా వాటికి స్పందించడం లేదు. ఎందుకంటే తను పబ్లిక్ సెలబ్రిటీ కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దాని మీద తను స్పందించాల్సిన అవసరం లేదంటూ ఒక మెచ్యూర్డ్ ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు…