Sankranthi Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు దర్శకులు ఇప్పుడు బాలీవుడ్ గడ్డమీద మన జెండాను ఎగరేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ 2024వ సంవత్సరంలో చాలా అత్యున్నతమైన స్థాయికి వెళ్లిందనే చెప్పాలి. ఇక 2025 వ సంవత్సరం స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నా మన ఇండస్ట్రీ హీరోలు ఇప్పుడు సంక్రాంతి కానుకగా మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు… ఇక ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో ఏ సినిమా విజయాన్ని దక్కించుకుంది. ఏ సినిమా డిజాస్టర్ టాక్ తో ఢీలా పడిపోయిందనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా డివైడ్ టాక్ ని తెచ్చుకొని కొద్ది వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి. ఇక కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ సినిమా చాలా దారుణంగా తయారైందనే విషయం అయితే తెలుస్తోంది. మరి ఈ సినిమా కోసం దిల్ రాజు 400 కోట్ల బడ్జెట్ ను పెట్టినప్పటికీ ఈ బడ్జెట్ కూడా రికవరీ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…ఇక డైరెక్టర్ శంకర్ పని అయిపోయింది అంటూ ఆయన మీద చాలా విమర్శలైతే వస్తున్నాయి….
ఇక బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘డాకు మహారాజు’ సినిమా ఈనెల 12వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఇక అలాగే ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని కూడా సాధించింది అంటూ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన అయితే లభిస్తుంది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో బాలయ్య బాబు మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచారనే చెప్పాలి….
ఇక ఈరోజు వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారనే చెప్పాలి.
ఇక మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఈ సంవత్సరంలో దక్కిన మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ గా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో మరోసారి వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి. అలాగే అనిల్ రావిపూడి మరోక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని వరుసగా ఎనిమిదో విజయాన్ని కూడా దక్కించుకున్నాడు…