https://oktelugu.com/

Balakrishna : బాలయ్య శ్రీదేవి తో సినిమా చేయకుండా అడ్డుకుంది ఎవరు..? అసలు కారణం ఏంటంటే..?

మంచి విజయాలను కూడా అందుకున్నాయి.ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబో కోసం ఇంకెప్పుడు మరే దర్శక నిర్మాత ట్రై చేయలేదట...ఇక రెండుసార్లు సీనియర్ ఎన్టీఆర్ వల్లే బాలయ్య బాబు శ్రీదేవి కాంబినేషన్ లో రావాల్సిన సినిమాలు రాలేదని చాలామంది సినిమా పండితులు సైతం ఇప్పటికి చెబుతూ ఉంటారు...

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 02:55 PM IST

    Who stopped Balayya from doing a film with Sridevi

    Follow us on

    Balakrishna – Sridevi : సినీయర్ ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలయ్య బాబు మొదట్లో మంచి విజయాలు అందుకున్నాడు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లోకి వెళ్ళిన బాలయ్య ఆ తర్వాత కొన్ని ప్లాప్ లను కూడా చవి చూడాల్సి వచ్చింది. ఇక మొత్తానికైతే స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత తను చేసిన సినిమాలు స్టోరీల ఎంపికలో కొన్ని లోపాలు ఉండడం వల్ల బాలయ్య బాబు చాలా వరకు ప్లాప్ లను మూటగట్టుకావాల్సి వచ్చింది.

    ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్లందరితో బాలయ్య నటించాడు. ఒక్క శ్రీదేవితో మాత్రమే ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి కారణం ఏంటి? అనే ప్రశ్న మనందరిలో తలెత్తుతుంది. బాలయ్య లాంటి స్టార్ హీరో శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్ తో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, శ్రీదేవి ని హీరోయిన్ గా పెట్టి ‘సామ్రాట్’ అనే ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి అయితే సెట్ అవ్వదని సీనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో ఆమె ప్లేస్ లోకి విజయశాంతి ని తీసుకున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక మరోసారి కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన ‘భలేదొంగ’ అనే సినిమా కోసం బాలయ్యకు జోడిగా శ్రీదేవిని తీసుకోవాలి అనుకున్నారు. ఇక శ్రీదేవి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అప్పుడే ఆమె ఎన్టీఆర్ తో కూడా సినిమాలు చేస్తుంది.

    ఇక ఇది తెలిసిన కొంతమంది ఎన్టీఆర్ సన్నిహితులు ఆయనతో శ్రీదేవి మీతో సినిమా చేస్తూనే, మీ అబ్బాయి తో కూడా సినిమా చేస్తే చూడ్డానికి అంత బాగుండదు అని చెప్పడంతో ఎన్టీఆర్ మళ్ళీ ఈ కాంబినేషన్ ని బ్రేక్ చేశాడు. ఇక మరోసారి ఈ సినిమా కోసం విజయశాంతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో బాలయ్య బాబు విజయశాంతి కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్ గా గుర్తింపు పొందింది. అలా వీళ్ళ కాంబో లో చాలా సినిమాలు వచ్చాయి.

    మంచి విజయాలను కూడా అందుకున్నాయి.ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబో కోసం ఇంకెప్పుడు మరే దర్శక నిర్మాత ట్రై చేయలేదట…ఇక రెండుసార్లు సీనియర్ ఎన్టీఆర్ వల్లే బాలయ్య బాబు శ్రీదేవి కాంబినేషన్ లో రావాల్సిన సినిమాలు రాలేదని చాలామంది సినిమా పండితులు సైతం ఇప్పటికి చెబుతూ ఉంటారు…