Bheemla Nayak : ఇంతకీ ‘భీమ్లానాయక్’ క్రెడిట్ ఎవరిది?

Bheemla Nayak :  ‘భీమ్లానాయక్’ బంపర్ హిట్ అయ్యింది. ఓకే.. ఫలితం అనుకూలంగా వచ్చింది కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కని వ్యవహారం. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మొత్తం మేనేజ్ చేస్తున్నాడని ‘త్రివిక్రమ్’పై ఒక అపవాదు ఉంది. అజ్ఞాతవాసి లాంటి సినిమా తీసి పవన్ కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడన్న విమర్శ పవన్ ఫ్యాన్స్ లో లావాలా రగులుతోంది. అందుకే ‘భీమ్లానాయక్’ మూవీ విషయంలో […]

Written By: NARESH, Updated On : February 27, 2022 2:24 pm
Follow us on

Bheemla Nayak :  ‘భీమ్లానాయక్’ బంపర్ హిట్ అయ్యింది. ఓకే.. ఫలితం అనుకూలంగా వచ్చింది కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కని వ్యవహారం. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మొత్తం మేనేజ్ చేస్తున్నాడని ‘త్రివిక్రమ్’పై ఒక అపవాదు ఉంది. అజ్ఞాతవాసి లాంటి సినిమా తీసి పవన్ కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడన్న విమర్శ పవన్ ఫ్యాన్స్ లో లావాలా రగులుతోంది.

అందుకే ‘భీమ్లానాయక్’ మూవీ విషయంలో త్రివిక్రమ్ తెరవెనుక ఉండి నడిపించాడు. నిజానికి ఈ సినిమా అటూ ఇటూ అయినా దర్శకుడు సాగర్ కే చంద్రకే ఎఫెక్ట్ అయ్యేది. ఎందుకంటే సినిమాలో స్క్రీన్ ప్లే,మాటలు అద్భుతంగా రాశారు త్రివిక్రమ్. మునుపెన్నడూ లేని విధంగా పవన్ కు హిట్ ఇచ్చేందుకు తెగ కష్టపడ్డాడు. సాగర్ కే చంద్రను ముందు నిలిపి ఈ చిత్రం మొత్తం త్రివిక్రమ్ యే నడిపించాడు.

సినిమాకు దర్శకుడు సాగర్ కే చంద్ర అయినా కూడా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడంలో పవన్ ను, రానాను కలిపి తీయడంలో.. ఇంత గొప్పగా తీర్చిదిద్దడంలో కృషి చేశారు. దర్శకత్వం సాగర్ కే చంద్ర అయినా కూడా మొత్తం నడిపించింది త్రివిక్రమ్ యే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పవన్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని త్రివిక్రమప్ పడ్డ కష్టం అంతా కాదని దగ్గరి నుంచి చూసిన వారు చెబుతున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ అంచనాలు, ఇతరత్రా విషయాల దృష్ట్యా సాగర్ కే పెద్దపీట వేశాడట.. మలయాళ రిమేక్ అయ్యప్పమ్ కోషియమ్ రిమేక్ కోసం సాగర్ కే చంద్ర మూడు నాలుగు వెర్షన్లు రాశాడట.. దీనికి త్రివిక్రమ్ కొత్త సీన్లు, ఎమోషన్లు యాడ్ చేసి మసాలా దట్టించడంతో ఈ సినిమా సెట్ అయ్యింది.

అయితే క్రెడిట్ మాత్రం సాగర్ కే ఇవ్వాలని ప్రీరిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ కనిపించలేదు. మాట్లాడలేదు. ‘భీమ్లానాయక్’ ను అంతా త్రివిక్రమ్ నడిపించాడని.. సాగర్ ను తొక్కేశాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ యువ దర్శకుడికే క్రెడిట్ కోసం త్రివిక్రమ్ ఎక్కడా ప్రీరిలీజ్ లో ఫోకస్ కాలేదు. ఇప్పుడు హిట్ కొట్టడంతో ‘థాంక్యూ మీట్ ’లో సాగర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని.. దాన్ని పవన్ స్టైల్ కు మార్చి తీశాడని ప్రశంసించాడు. మొత్తానికిసినిమా పూర్తై విజయం సాధించింది. క్రెడిట్ ఎవరిదైనా పవన్ ఫ్యాన్స్ లోటు తీర్చింది. సాగర్ చంద్రకు పేరు తెచ్చింది.