Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా మీద భారీ బజ్ అయితే ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో నిర్వహిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగే ప్రతి హీరో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్లు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
మరి మొత్తానికైతే ఇప్పుడు పుష్ప 2 సినిమాకు సంబంధించిన బజ్ జనాల్లో ఎక్కువగా ఉంది. మరి ఈ సినిమా ఎంతటి సక్సెస్ ని సాధిస్తుంది ఫైనల్ గా ఎంత కలెక్షన్స్ ని రాబడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి స్టోరీ కొంతవరకు లీకైనట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాల్లో పుష్పరాజ్ భార్య అయిన శ్రీ వల్లి చనిపోబోతుందనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమెని ఎవరు చంపుతారు అనే విషయాలను బట్టి చూస్తుంటే మంగళం శ్రీను తో పాటు సిండికేట్ లో కొత్తగా వచ్చిన ఒక రౌడీ కలిసి శ్రీవారిని చంపేస్తారట.
ఇక దాంతో వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోడానికి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లి గంగాలమ్మ జాతరలో తిరిగి వచ్చి ఒక్కొక్కరిని చంపుతూ ముందుకు సాగుతూ ఉంటాడని ఫైనల్ గా తను అనుకున్న గోల్ ను రీచ్ అయ్యే వరకు ముందుకు దూసుకెళ్తూ ఉంటాడని ఈ సినిమా నుంచి కొంతవరకు న్యూస్ అయితే బయటకు వస్తుంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందనే విషయాల్లో క్లారిటీ లేదు. కానీ సినిమా రిలీజ్ అయితే తప్ప వీటన్నింటికి ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాదు…