Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రష్మిక మందాన పేరుతో బోల్డ్ వీడియో వైరల్ కావడంపై ఆందోళలను వ్యక్తం అవుతున్నాయి. జరా పటేల్ అనే మహిళ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోను డీప్ ఫేక్ చేసి రష్మిక వీడియోగా వైరల్ చేశారు. అది నిజమని నమ్మిన పలువురు నెటిజెన్స్ రష్మికపై వ్యతిరేక కామెంట్స్ చేశారు. ఒక జర్నలిస్ట్ ఒరిజినల్ వీడియో షేర్ చేయడంతో మేటర్ వెలుగులోకి వచ్చింది. జర్నలిస్ట్ ట్వీట్ ని హైలెట్ చేస్తూ అమితాబ్ బచ్చన్ ‘ఇది సీరియస్ మేటర్ చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
రష్మికకు మద్దతుగా పలువురు సెలెబ్స్ నిలబడ్డారు. డీప్ ఫేక్ వీడియో సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం మీద వెంటనే ప్రభుత్వాలు స్పందించాలి. బాధితులను కాపాడేందుకు కొత్త చట్టాలు తేవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ నే రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటన కదిలించింది. సంబంధిత మంత్రులు స్పందించారు.
కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియోలో ఉన్న ఒరిజినల్ యువతి సంఘటనపై స్పందించారు. ఆమె పేరు జరా పటేల్ కాగా… ఇంస్టాగ్రామ్ వేదికగా కామెంట్ చేశారు. ”నా బాడీ ఉపయోగించి ఓ బాలీవుడ్ నటి డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఆ వీడియోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే విషయం తెలిసి నేను ఎంతో బాధపడ్డాను. ఇకపై మహిళలు సోషల్ మీడియాలో సమాచారం పంచుకునేందుకు మరింత భయపడతారు. నెటిజెన్స్ కూడా సోషల్ మీడియా కంటెంట్ పై ఒక అవగాహనకు వచ్చే ముందు నిజానిజాలు తెలుకోవాలి…” అని ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ పెట్టారు.
రష్మిక డీప్ ఫేక్ వీడియో కారణం ఈ జరా పటేల్ పిచ్చ పాప్యులర్ అయ్యింది. ఈమె ఎవరని పరిశీలిస్తే… భారతీయ మూలాలున్న బ్రిటన్ యువతి. ఆమె వృత్తి రీత్యా ఇంజనీర్. అలాగే మెంటల్ హెల్త్ అడ్వొకేట్ అట. జరా పటేల్ కి ఇంస్టాగ్రామ్ లో నాలుగున్నర లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన బోల్డ్ వీడియోలు, ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.
View this post on Instagram