Abbas: సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొనసాగుతున్న కొందరు హీరోలు చిన్నప్పుడే షూటింగ్ స్పాట్ కు అడుగుపెట్టేవారు. కొందరు తమ బంధువులు సినిమాల్లో నటిస్తుంటే చూడ్డానికి వస్తారు.. మరికొందరు తమ అభిమాన హీరో ఎలా నటిస్తున్నాడో తెలుసుకోవడానికి ఫ్యాన్స వస్తుంటారు. ఇలా వచ్చిన సందర్భాల్లో అభిమాన హీరోతో ఒక్క ఫొటో దిగాలని కోరుకుంటారు. అలా తీసుకున్న ఫొటోను చాలా మంది గుర్తుగా ఉంచుకునేవారు. ప్రస్తుతం సినిమాల్లో కొనసాగుతున్న ఓ హీరో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ ఫొటో తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పిక్ ను సోషల్ మీడియాకు షేర్ చేసి తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు?
పై ఫొటోలో ఉన్నవారిలో ఒకరు అబ్బాస్ అని అందరూ గుర్తుపడుతారు. ప్రేమ దేశం సినిమాతో పాన్ ఇండియా లెవల్లో పరిచయం అయిన అబ్బాస్ కు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. ఆ రోజుల్లో ఒక్క సినిమాతో స్టార్ అవడం చాలా కష్టం. కానీ అబ్బాస్ కు మాత్రం విపరీతంగా ఫ్యాన్స్ పెరిగి ఆయన సినిమా కోసం చూసేవాళ్లు. అయితే ఆయన ఫస్ట్ మూవీ బెస్ట్ అయినా.. ఆ తరువాత మాత్రం అనుకున్న విజయాలు సొంతం కాలేదు. దీంతో అబ్బాస్ ప్రతినాయకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గాక జర్మనీకి వెళ్లారు.
ఇటీవల అబ్బాస్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ తరుణంలో అబ్బాస్ తో కలిసి చిన్నప్పుడు ఫొటో దిగిన ఓ హీరో ఆ పిక్ ను బయటపెట్టాడు. నా అభిమాన హీరో అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ పిక్ వైరల్ కావడంతో అబ్బాస్ సైతం స్పందించాడు. ఈ ఫొటోకు రిప్లై ఇచ్చాడు. ఇంతకీ అబ్బాస్ పక్కన ఉన్న ఆ హీరోఎవరని అనుకుంటున్నారు?
ఆయన ఎవరో కాదు తమిళ హీరో జై. ఆ మధ్య జర్నీ మూవీ అందరి హృదయాలను కలిచివేసిన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఇద్దరు హీరోల్లో జై ఒకరు. ఆ తరువాత ఈయన లవ్ జర్నీ, రాజారాణి వంటి సినిమాల్లో నటించారు. ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. కానీ నేరుగా ఒక్క తెలుగులో నటించలేదు. అయినా ఆయన సినిమాలంటే లైక్ చేసేవారు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు ఇక్కడ ఆడుతూ ఉంటాయి. ఈ సందర్భంగా ఆయన చిన్నప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి అబ్బాస్ ను కలిసినప్పుడు ఈ పిక్ తీసుకున్నాడు. దీనిని ఇప్పుడు బయటపెట్టాడు.