
బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ మొత్తానికి మూడో వారం చివరకి చేరుకుంది. ఇటు నాగార్జున తనదైన హోస్టింగ్ తో జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంటే అటు కంటెస్టెంట్లు కూడా దొరికించే చాన్స్ అన్నట్లుగా హౌస్‌లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్‌ను రఫ్ఫాడిస్తున్నారు. 19 మందిని కంటెస్టెంట్స్ ని హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ లో 17 కంటెస్టెంట్స్ ఉన్నారు. మొదటి వారానికి గాను బూతులతో రెచ్చిపోయిన “సరయు” ఎలిమినేట్ కాగా, రెండవ వారానికి గాను ఉమా దేవి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా మూడో వారం లో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.
ఇదిలా ఉండగా మూడో వారానికి గాను జెస్సీ కెప్టెన్ గా నిలిచాడు. ప్రతీ వారం కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ వుంటుంది. ఆ టాస్క్ అవ్వగానే బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో, వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో ఎన్నుకోవాలి. వరస్ట్ పర్ఫార్మర్ ని జైల్లో వేస్తారు. మొదటి వారం కి గాను జెస్సీ నామినేట్ అవ్వగా, రెండవ వారానికి సన్నీ నామినేట్ అయ్యి జైలు కి వెళ్ళారు.
మరి మూడో వారానికి గాను ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఒక వరస్ట్ పర్ఫార్మెన్స్ ని ఎంపిక చేసుకోవాలి. ఒక్కరోజు ముందుగానే షూటింగ్ అవ్వడం వల్ల బిగ్ బాస్ హౌస్ లో లీకుల పర్వం కొనసాగుతోంది. అలా లీకులు జరుగుతున్న తరుణంలో బిగ్ బాస్ మూడవ వారానికి గాను వరస్ట్ పర్ఫార్మర్ కింద “మానస్” నిలిచాడని వినికిడి.