Young Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలందరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలతో సంబంధం లేకుండా వాళ్లకు నచ్చిన కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళు బిజీగా ఉన్నారు… ఇక ప్రస్తుతం చిన్న హీరోలందరిలో వరుస గా సినిమాలను చేస్తు టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళుతున్న హీరోలు ఎవరు అనేది ఒకసారి తెలుసుకుందాం…
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరిలో నాని డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టడమే కాకుండా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక అరుదైన గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెట్టాయి…చిన్న హీరోలందరిలో టాప్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ లాంటి నటుడు సైతం వరుస విజయాలను సాధించకపోయిన కూడా ఆయనకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి అతను నాని తర్వాత పొజిషన్ ను కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది…
ఇక వీళ్ల తర్వాత స్థానంలో తేజ సజ్జ లాంటి నటుడు ఉన్నాడు. ఇక ఆ తర్వాత సాయిధరమ్ తేజ్, శర్వానంద్, గోపిచంద్, శ్రీ విష్ణు, నవీన్ పోలిశెట్టి లాంటి నటులు వాళ్ల సినిమాలతో అడపా దడప సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి వాళ్ల కంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నారు. కంటిన్యూస్ గా సక్సెస్ లు సాధించిన వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపైతే ఉంటుంది.
ఇక అలాంటివారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంకెవరు లేరు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది… అడపాదడప సక్సెస్ లను సాధించిన కుర్ర హీరోలు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు వాళ్ళ కెరియర్ ను నిలబెట్టుకోలేకపోతున్నారు.
కారణం ఏదైనా కాన్స్టాంట్ గా సక్సెస్ లను సాధించిన యంగ్ హీరోలు మాత్రమే మీడియం రేంజ్ హీరోలుగా టైర్ 2 హీరోలుగా మారుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక వీళ్ళ నుంచి సంవత్సరానికి ఒకటి నుంచి రెండు సినిమాలు రావడంతో ఇండస్ట్రీ కొంతవరకు సక్సెస్ బాట పడుతుందనే చెప్పాలి…