Junior NTR – Allu Arjun : ఎన్టీయార్, అల్లు అర్జున్ వీళ్లలో ఎవరు టాప్ హీరో… ఎవరిని ఎవరు డామినేట్ చేస్తున్నారు..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి ఇమేజ్ అయితే ఉంటుంది. వాళ్లకు మంచి గుర్తింపు తో పాటు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ను కూడా సంపాదించుకుంటారు. ఇక ఇక్కడ సక్సెస్ లతోనే హీరోలకు స్టార్ డమ్ అయితే దక్కుతుంది...

Written By: Gopi, Updated On : October 23, 2024 11:58 am

Junior NTR - Allu Arjun

Follow us on

Junior NTR – Allu Arjun :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలను చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు. ఇక దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన తనదైన రీతిలో సత్తాను చాటడమే కాకుండా ప్రేక్షకులందరి మన్ననలను పొందుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక డిసెంబర్ ఆరోవ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి రెడీ అవుతున్నాడు…

ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ కి మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది. ఇక దేవర సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఎన్టీఆర్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇక పుష్ప 2 సినిమాతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు రాబడతానని అల్లు అర్జున్ భారీ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. మరి ఎన్టీయార్, అల్లు అర్జున్ వీళ్లిద్దరిలో ఎవరు టాప్ హీరో అనే దాని మీదనే చాలా రోజుల నుంచి చాలా చర్చలైతే నడుస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఒకప్పుడు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని డామినేట్ చేస్తూ భారీ ఎత్తుకు ఎదిగాడు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ డామినేట్ చేస్తూ వస్తూ ఉండడం విశేషం… వరుసగా రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలా వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన పుష్ప సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్లను అయితే రాబట్టాడు. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు.

ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కొంత వరకు ముందంజలో ఉన్నప్పటికి పుష్ప 2 సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఈ అంచనాలు మొత్తం తారుమారయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను ఈజీగా రాబడుతోందని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…