https://oktelugu.com/

Tollywood- Dil Raju: టాలీవుడ్ ఫ్లాపులకు కారణం ఎవరు ? దిల్ రాజు ఆధిపత్యానికి చెక్ పడేదెప్పుడు ?

Tollywood- Dil Raju: టాలీవుడ్ లో ప్రస్తుతం  దిల్ రాజు పై చాలామంది పెదవి  విరుస్తున్నారు.  కొందరు  డిస్ట్రిబ్యూటర్లు  రాజుగారి పై డైరెక్ట్ గానే నోరు పారేసుకుంటున్నారు. కారణం.. రెండు సినిమాలు ‘థాంక్యూ, మాచర్ల నియోజకవర్గం’.  చిన్నదైనా, పెద్దదైనా, రీజనల్ మూవీ అయినా, పాన్ ఇండియా ఫిలిం అయినా  తన  సినిమా రేంజ్ ను బట్టి  క్యాష్ చేసుకుంటాడు దిల్ రాజు.   ఈ క్రమంలో  దిల్ రాజు దగ్గర సినిమా కొనుక్కున్న బయ్యర్లకు నష్టాలు వస్తే..  తర్వాత సినిమాలో లాభాలు వస్తాయని […]

Written By:
  • Shiva
  • , Updated On : August 16, 2022 / 11:48 AM IST
    Follow us on

    Tollywood- Dil Raju: టాలీవుడ్ లో ప్రస్తుతం  దిల్ రాజు పై చాలామంది పెదవి  విరుస్తున్నారు.  కొందరు  డిస్ట్రిబ్యూటర్లు  రాజుగారి పై డైరెక్ట్ గానే నోరు పారేసుకుంటున్నారు. కారణం.. రెండు సినిమాలు ‘థాంక్యూ, మాచర్ల నియోజకవర్గం’.  చిన్నదైనా, పెద్దదైనా, రీజనల్ మూవీ అయినా, పాన్ ఇండియా ఫిలిం అయినా  తన  సినిమా రేంజ్ ను బట్టి  క్యాష్ చేసుకుంటాడు దిల్ రాజు.   ఈ క్రమంలో  దిల్ రాజు దగ్గర సినిమా కొనుక్కున్న బయ్యర్లకు నష్టాలు వస్తే..  తర్వాత సినిమాలో లాభాలు వస్తాయని సర్దుబాటు చేసుకునేవాడు.  కానీ,  గత కొన్ని సినిమాలుగా అన్నీ నష్టాలే వస్తున్నాయి.

    Tollywood

    దీనికి తోడు  ఎంతో కొంత బజ్ ఉన్న  సినిమాని దిల్ రాజే రిలీజ్ చేస్తున్నాడు.  ఇక్కడ కూడా  బయ్యర్ల దగ్గర అధిక మొత్తంలో  వసూళ్లు చేస్తున్నాడు.  పైగా దిల్ రాజు సినిమాని కాదు అని,  వేరే సినిమా కొనుక్కుంటే  ఆ బయ్యర్లకు థియేటర్లు దొరకవు.  కాబట్టి..  చచ్చినట్టు  దిల్ రాజు దగ్గరే సినిమా కొనుక్కోవాలి.  చిన్న బయ్యర్లు అయితే   దిల్ రాజు చెప్పిన సినిమానే కొనుక్కోవాలి. ఇది  ప్రస్తుత  తెలుగు సినిమా పంపిణీ పరిస్థితి. ఈ క్రమంలో  చిన్న చిన్న ఏరియాల్లో థాంక్యూ సినిమా కొనుక్కుని భారీగా  నష్టపోయిన బయ్యర్లకు,  మాచర్ల నియోజకవర్గం సినిమా అంటగట్టాడు దిల్ రాజు.

    Also Read: Bigg Boss 6 List Of Contestants: బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ ఇదే.. వాళ్ళు కూడా ఉన్నారు.. ఈ సారి హౌస్ లో సంచలనమే

    అయితే,  మాచర్ల నియోజకవర్గం అంతకంటే ప్లాప్ అయ్యింది. అంతకంటే కూడా  భారీగా  నష్టాలను మిగిల్చింది. సహజంగా చైతు, నితిన్ లాంటి  ఏవరేజ్ హీరోల  సినిమాలకి కూడా  బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలు అంటూ  కాసులు  వర్షం కురుస్తాయి.  కానీ, ఈ మధ్య   సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.  అసలే థియేటర్లలో బాదుడు  బాగా పెరిగింది కాబట్టి,  పాజిటివ్ టాక్ వస్తేనే  కామన్ ఆడియన్  థియేటర్ మొహం చూస్తున్నాడు. అందుకే,  దిల్ రాజు  ఇన్నాళ్లు తమ సినిమాకి పాజిటివ్ టాక్  తేవడానికి పెద్ద నెట్ వర్కే మెయింటైన్ చేశాడు.

    ముఖ్యంగా  రివ్యూలను,   రివ్యూవర్లను బాగా మేనేజ్ చేస్తూ వచ్చాడు.  ఎలాగూ అమ్ముడుపోయే విశ్లేషకులూ ఉన్నారు కాబట్టి..  దిల్ రాజు ప్లాప్  సినిమాలకు కూడా వారంతా  ఏవరేజ్ టాక్ అంటూ పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చేవాళ్ళు.  కానీ, ఈ మధ్య సోషల్ మీడియా దెబ్బకు పాజిటివ్ రివ్యూలు కూడా పని చేయడం లేదు.  సొమ్ము చేసుకునే వెబ్ సైట్లును ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.  ఇక్కడే  తేడా  కొడుతోంది.  సినిమాకి రేట్ ఇచ్చి కొనుక్కునే  రేటింగ్ ఎందుకు  పనికిరాకుండా పోతుంది.
    సినిమా బాగా లేకపోతే.. ట్విట్టర్ లో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

    Dil Raju

    దాంతో లోపాయికారీ ఒప్పందాలు  లోపాన్ని దాచలేకపోతున్నాయి. దీంతో సినిమాకి రావాల్సిన కనీస కలెక్షన్స్ కూడా రావడం లేదు. సినిమాకి  ప్లాప్ టాక్ రాగానే  ఆ సినిమాకి సింగిల్ డిజిట్ టికెట్లు కూడా తెగడం లేదు.  ఇదే ఇప్పుడు దిల్ రాజు లాంటి నిర్మాతలకు  అస్సలు  డైజెస్ట్ కావట్లేదు.

    అందుకే, సోషల్ మీడియాలో తమ చిత్రాలకు నెగెటివ్ రివ్యూలు రాస్తున్న వారి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాడు దిల్ రాజు.  అంతేగాని తమ ప్రయత్నంలోని తడబాటుని, తప్పుని మాత్రం అస్సలు ఒప్పుకోలేకపోతున్నాడు.  ఇదే సోషల్ మీడియా బాగున్న సినిమాకి పాజిటివ్ గా  మెసేజ్ లు పెట్టినప్పుడు మాత్రం,  పెద్ద ఎస్సెట్ అని  లొట్టలు వేసుకుంటూ, రీ ట్వీట్లు కొట్టుకుంటారు.

    అయినా,  బాగుంది అంటే  భుజాలు చరుచుకుని,  బాగాలేదు అంటే  భుజాలు తడుముకోవడం టాలీవుడ్ నిర్మాతలకే చెల్లింది.   అసలు యునానిమస్ హిట్ టాక్ ని ఎంజాయ్ చేసే దిల్ రాజు లాంటి నిర్మాతలు,   మిక్స్ డ్ రెస్పాన్స్ ని కూడా హుందాగా స్వీకరించే రోజు ఎప్పుడు వస్తోందో. అలాగే  ప్లాప్ అయ్యే  సినిమాని అధిక మొత్తంలో అమ్ముకుని బయ్యర్లను నిండా ముంచే రోజులు ఎప్పటికీ పోతాయో !!   మునుముందైనా  టాలీవుడ్ లో  ఇలాంటి లోపాయికారీ లొసుగులు  కనుమరుగవ్వాలని, బయ్యర్లకు నచ్చిన సినిమాని కొనుక్కునే రోజులు రావాలని ఆశిద్దాం.

    Also Read: Nithin: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న హీరో నితిన్

    Tags