https://oktelugu.com/

బిగ్ బాస్-4: ఈవారం హోస్ట్ ఎవరు? సస్పెన్స్ కొనసాగనుందా?

బిగ్ బాస్-4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ ఎనిమిది వారాలను పూర్తి చేసుకోగా ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతోంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ షోను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. Also Read: ప్రభాస్‌ మూవీ @ 600 కోట్లు బిగ్ బాస్-4 సీజన్ కు కింగ్ నాగార్జున హోస్టుగా చేస్తున్నాడు. అయితే తన ‘వైల్డ్ డాగ్’ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 01:14 PM IST
    Follow us on

    బిగ్ బాస్-4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ ఎనిమిది వారాలను పూర్తి చేసుకోగా ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతోంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ షోను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

    Also Read: ప్రభాస్‌ మూవీ @ 600 కోట్లు

    బిగ్ బాస్-4 సీజన్ కు కింగ్ నాగార్జున హోస్టుగా చేస్తున్నాడు. అయితే తన ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం నాగార్జున ఇటీవల కూలుమానాలి వెళ్లాడు. అక్కడే 21రోజులపాటు ఉండనున్నట్లు నాగార్జున ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెల్సిందే. దీంతోనే మొన్నటి వీకెండ్ లో నాగార్జున కన్పించలేదు. దీంతోనే బిగ్ బాస్-4లో హోస్టుగా సమంత ఎంట్రీ ఇచ్చింది.

    కిందటి వారం దసరా పండుగ కలిసి రావడంతో బిగ్ బాస్ నిర్వహాకులు సమంతతో స్పెషల్ కార్యక్రమం చేశారు. అయితే నాగార్జున మరో రెండువారాలు మనాలీలోనే ఉండాల్సి రావడంతో గెస్ట్ హోస్టు తప్పదనే టాక్ విన్పిస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ శుక్రవారమే నాగార్జున మనాలీ నుంచి హైదరాబాద్ కు రాబోతున్నారట. దీంతో ఈవారం హోస్ట్ గా నాగార్జున చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.

    మనాలీ నుంచి హైదరాబాద్ కు నాగార్జున రావడం పెద్ద కష్టమే కాదని తెలుస్తోంది. కిందటి వారమే నాగార్జున రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన కోడలు సమంతను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దసరా కారణంగా స్పెషల్ ఎపిసోడ్స్ చేయడం కూడా బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

    Also Read: అమ్మాయి లవర్ అన్నారు.. 10వేలు కట్టా.. మోసపోయిన హైపర్ ఆది

    తాజాగా నాగార్జున శుక్రవారమే మనాలి నుంచి హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది. దీంతో ఈ వారం నాగార్జునే బిగ్ బాస్-4లో హోస్టుగా చేస్తారనే టాక్ విన్పిస్తోంది. సమంత హోస్టింగ్ పై మిక్స్ డ్ రెస్పాన్స్ రావడంతోనే నాగార్జున మళ్లీ హోస్టుగా ఎంట్రీ ఇస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరీ ఈ వారం నాగార్జున కంటెస్టులను ఓ ఆటఆడిస్తారో లేదో వేచిచూడాల్సిందే..!