Boyapati Srinu: విజయేంద్ర ప్రసాద్ స్టోరీ తో బోయపాటి సినిమా హీరో ఎవరంటే..?

టార్ డైరెక్టర్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య బాబు తో ఒక సినిమా చేయడానికి కమిట్ సిద్దం అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర కథని తీసుకొని ఒక స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : January 27, 2024 3:45 pm
Follow us on

Boyapati Srinu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత మాస్ సినిమాలని ఎక్కువగా చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మరొక దర్శకుడు బోయపాటి శ్రీను…ఈయన చేసిన అన్ని సినిమాలు కూడా మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఒక యాక్షన్ ఎపిసోడ్ కి ముందు ఆయన క్రియేట్ చేసే ఎమోషన్ కూడా ప్రేక్షకుల్లో చాలా డెప్త్ ని క్రియేట్ చేస్తుంది.

ఇక ఆయన స్టార్ డైరెక్టర్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య బాబు తో ఒక సినిమా చేయడానికి కమిట్ సిద్దం అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర కథని తీసుకొని ఒక స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది. మరి ఆ హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ బోయపాటి శ్రీను మాత్రం ఒక పెద్ద భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

అయితే బోయపాటి సినిమాల్లో పెద్దగా కథ ఉండకపోయిన కూడా ఆయన డైరెక్షన్ మాత్రం చాలా బాగా చేస్తాడు. అలాగే ఒక సినిమాలో ఎలివేషన్స్, ఎమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేస్తాడు. ఇక విజయేంద్ర ప్రసాద్ లాంటి ఒక గొప్ప రైటర్ కథ ఇచ్చాడు అంటే బోయపాటి ఇక ఆకాశమే హద్దు గా చెలరేగిపోతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో గా ఎవరు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇంతకు ముందు బోయపాటి రామ్ తో చేసిన స్కంద సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

దాంతో ఆయన ఇప్పుడు బాలయ్య బాబుతో సినిమా చేసి భారీ సక్సెస్ ను కొట్టాలని చూస్తున్నాడు ఇక ఆ తర్వాత విజయేంద్రప్రసాద్ గారి కథతో ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ స్టార్ హీరో ఎవరు అనేది తొందర్లోనే క్లారిటీ ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే బోయపాటి కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…