Kamala Haasan And Rajamouli: ఇండియాలోనే లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఏకైక డైరెక్టర్ రాజమౌళి… ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా మాస్ సినిమాలు చేస్తు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకానొక టైమ్ లో రాజమౌళి మాస్ సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా రాజమౌళి లా మాస్ సినిమా తీసే దర్శకుడు ఇండియా లోనే లేరు అనేంత లా గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఆయన మాస్ సినిమాలను పక్కనపెట్టి గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు.ఇక ఇప్పటికి కూడా రాజమౌళిని బీట్ చేసే డైరెక్టర్ ఇండియాలోనే లేడు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే యమదొంగ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కమలహాసన్ తో ఒక ఆర్ట్ సినిమా చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. దానికి విజయేంద్ర ప్రసాద్ ఒక మంచి కథ ను కూడా రాసి రెడీగా పెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్ళలేదు.
ఇక అప్పుడే రామ్ చరణ్ ను పెట్టి మగధీర సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక మగధీర తర్వాత నుంచి రాజమౌళి గ్రాఫ్ అంతకుముందు కంటే ఒక పదింతలు పెరిగింది. దాంతో ఆయన ఆర్ట్ సినిమాల వైపు ఫోకస్ చేయలేదు. వరుసగా భారీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి కమలహాసన్ కాంబినేషన్ లో కనక ఒక సినిమా పడుంటే అది వేరే లెవెల్లో ఉండేది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలుగులో ఒకప్పుడు కే విశ్వనాథ్ చేసిన ఆర్ట్ సినిమాలను మినహాయిస్తే ఇప్పుడు ఎవరూ అంతటి సాహసం చేయట్లేదు.
కానీ రాజమౌళి కనక ఆ సినిమా చేసుంటే మాత్రం దాని మీద 100% ఎఫర్ట్ పెట్టుండేవాడు కాబట్టి ఆ సినిమా సూపర్ గా ఉండేది అంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం అప్పట్లో ఈ విషయం మీద స్పందించారు. ఇక మొత్తానికైతే రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం ఆయన వన్ ఆఫ్ ది లెజెండరీ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు…