Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారానికి చేరుకుంది . ఇప్పటి వరకు గడిచిన నాలుగు వారాలు కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు గా మారేందుకు ,పవర్ అస్త్రాల కోసం పోటీ పడుతూ వచ్చారు .పవర్ అస్త్రాలను సాధించి సందీప్ ,శివాజీ ,శోభా ,ప్రశాంత్ ఇంటి సభ్యులు గా మారిన విషయం తెలిసిందే . గత వారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కొందరు శివాజీ ఇంటి సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు అని చెప్పడం తో శివాజీ పవర్ అస్త్రా వెనక్కి తీసుకున్నాడు బిగ్ బాస్ .
ఈ రోజు ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు సందీప్ ,శోభా శెట్టి ,పల్లవి ప్రశాంత్ ల దగ్గర ఉన్న పవర్ అస్త్రాలు కూడా లాగేసుకున్నాడు. ఈ సీజన్ లో మొదటి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . కెప్టెన్సీ తో పాటు సూపర్ ఇమ్మ్యూనిటీ పొందే అవకాశం ఇచ్చాడు . ”గెలిపించేది మీ నవ్వే ” ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ నవ్వుని పూర్తి చేసేందుకు పోటీ పడాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు. బజర్ మోగగానే కంటెస్టెంట్స్ అందరూ బరిలోకి దిగుతారు.
ఏ ఒక్కరు తగ్గకుండా గేమ్ ఆడారు . బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు కచ్చితంగా గొడవ పెట్టడానికే అన్నట్టు ఉంటాయి ,ఈ విషయం అందరికి తెలిసిందే . ఈ కెప్టెన్సీ టాస్క్ లో కూడా అమర్ ఇంకా శుభ శ్రీ గొడవ పడ్డారు . అమర్” నేను ఇంతే నా బిహేవియర్ మారదు” అంటూ గోల చేసాడు.” ఇక్కడ నో ఫేవరిజం నత్తింగ్ ” ఎవరు ఫెయిర్ గా ఆడితే వాళ్ళకి ఇవ్వడమే అని , శోభా గట్టిగా చెప్పింది.
ఇలా ఒకరి పై ఒకరు అరుచుకుంటూ ,గొడవలు పడుతూ కంటెస్టెంట్స్ హౌస్ హీట్ ఎక్కిస్తున్నారు . ఈ సీజన్ లో మొదటి కెప్టెన్సీ టాస్క్ కావడం తో కంటెస్టంట్స్ కెప్టెన్సీ కోసం నానా తంటాలు పడుతున్నారు . ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు ముందుకు వెళ్లారో క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే .
https://twitter.com/StarMaa/status/1709153821274874212