Bigg Boss OTT Telugu: తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బిగ్ బాస్.. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించింది. శనివారం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అట్టహాసంగా దీనిని ప్రారంభించగా.. మొదటి వారం ఇంటి కెప్టెన్సీ కోసం వేట మొదలైంది. బిగ్ బాస్ ఓటీటీ తొలి కెప్టెన్సీ కోసం రంగంలోకి ఆరుగురు కంటెస్టెంట్లు దిగుతున్నారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్ లో ఉండగా.. అందులో పది మంది బిగ్ బాస్ షోలలో గతంలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మిగిలిన వారు మాత్రం కొత్తవారు.

అయితే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లకు వారియర్స్ అని పేరు పెట్టి, కొత్త వారికి ఛాలెంజర్స్ అని పేరు పెట్టారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ గా సాగుతున్న పలు టాస్కుల్లో బిగ్ బాస్.. కొత్త వారైన ఛాలెంజర్స్ కు పలు అవకాశాలు ఇస్తూ సపోర్ట్ చేస్తు్న్నాడు.
Also Read: ఐశ్వర్య రాయ్, త్రిష’ లుక్స్ తో అదరగొట్టిన లెజెండరీ డైరెక్టర్
వారియర్స్ తో జరిగిన టాస్కులో ఛాలెంజర్స్ ఓడిపోగా.. వారియర్స్ నుండి తొలివారం ఇంటి కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నారు. బిగ్ బాస్ హౌజ్ తొలివారం, తొలి కెప్టెన్సీ కోసం అఖిల్ ,అరియానా ,మహేష్ , తేజస్వి , సరయు , నటరాజ్ మాస్టర్ పోటీపడుతున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అరియానా గ్లోరి , సరయు, అశురెడ్డి, తేజస్వి మదివాడ, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, బిందు మాధవి, హమీదా ఖాతూన్, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, మిత్రా శర్మ, యాంకర్ శివ, ఆర్జే చైతూ, స్రవంతి చొక్కారపు, అజయ్ కుమార్ కథ్వురార్, అనిల్ రాథోడ్ లు కంటెస్టెంట్లుగా ఉన్నారు. కాగా మొదటి వారంలో బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేషన్ కోసం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఓటింగ్ ఆధారంగా వారిని ఇంటి నుండి బయటకు పంపించేస్తారు. ఎమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లు.. ముమైత్ ఖాన్, హమీదా, అరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, సరయు, మిత్రా శర్మ, ఆర్జే చైతు.
Also Read: పాక్ – ఇండియా మధ్య యుద్ధంలో ఎన్టీఆర్ – అక్షయ్ కుమార్
[…] Bigg Boss OTT Telugu Ariyana Glory: తెలుగు ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్మెంట్ తో ముంచెత్తడానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ వచ్చేసింది. OTT ప్లాట్ ఫాం డిస్నీ హాట్ స్టార్ 24×7 నాన్ స్టాప్ ఎంటర్మైన్మెంట్ పేరుతో దీనిని ప్రసారం చేస్తోంది. శనివారం పూట బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున అట్టహాసంగా ప్రారంభించిన బిగ్ బాస్ నాన్ స్టాప్ అందరినీ అలరిస్తు ముందుకు సాగుతోంది. మొత్తానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తొలివారం నామినేషన్స్ ముగిశాయి. […]