Ravi Teja Dhamaka: వరుస సినిమాల్లో నటిస్తూ మాస్ మహారాజ్ రవితేజ జోరుమీద ఉన్నాడు. రవితేజ కొత్త మూవీ ‘ధమాకా’ నుంచి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల ప్రణవిగా నటిస్తోందని తెలియజేస్తూ.. రవితేజ, శ్రీలీల కలిసి ఉన్న ఫోటోను విడుదల చేసింది. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను.. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రవితేజ 69వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని.. చిరు ‘చంటబ్బాయి’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఎలాగూ త్రినాథరావ్ నక్కిన కూడా మంచి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి.. తన గత చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్’ సినిమాల శైలిలోనే నక్కిన ఈ సినిమాని కూడా మలచబోతున్నాడు.
Also Read: వాలంటైన్స్ డే రోజున భర్తతో విడిపోయిన బాలీవుడ్ నటి
పైగా రవితేజ కామెడీ టైమింగ్ కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుందట. ఏమైనా కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు రవితేజ. మరి రవితేజను కరెక్ట్ గా వాడుకుంటే.. నక్కినకి మరో హిట్ పడినట్టే. మాస్ మహారాజా రవితేజ చాలా కిందిస్థాయి నుంచి వచ్చిన హీరో. అందుకే, మాస్ పల్స్ బాగా తెలుసు.
ఇక రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ పోతున్నాడు. ఎలాగూ వయసు కూడా పెరుగుతుంది, మహా అయితే మరో నాలుగేళ్లు మాత్రమే యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. అందుకే, ఈ నాలుగేళ్లలో సాధ్యమైనంత వరకు సినిమాలు చేసి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఖిలాడీ, నక్కినతో ధమాకా, అదేవిధంగా రామారావు అనే సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. సంపత్ నందితో కూడా మరో సినిమా చేయడానికి రవితేజ రెడీ అయ్యాడు.
Also Read: తరుణ్ సునామీలో కొట్టుకుపోయిన మహేష్ బాబు సినిమా ఎదో తెలుసా ?
[…] […]