https://oktelugu.com/

Pokiri Heroine : పోకిరి సినిమాని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇక దాంతో పూరి ప్రభాస్ తో చేసిన ఏక్ నిరంజన్ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకున్నాడు ఈ సినిమా అంత పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2023 / 02:29 PM IST

    pokiri heroine

    Follow us on

    Pokiri Heroine : సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఈయన ఇండస్ట్రీ లో చాలా సినిమాలు తీస్తూ వరుసగా మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే ఈయనకి కెరియర్ మొదట్లో కొన్ని ప్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. ఈయన కెరియర్ లో మొదటగామంచి సక్సెస్ ని అందుకున్న సినిమా ఏది అంటే మురారి సినిమా అనే చెప్పాలి.

    ఇక ఈయన అందుకున్న మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అంటే అది ఒక్కడు మూవీ అనే చెప్పాలి.నిజానికి ఈ సినిమా తర్వాత మహేష్ కి కొన్ని ప్లాప్ లు కూడా వచ్చాయి అందులో నాని,నిజం, అర్జున్ లాంటి సినిమాలు ఉన్నాయి. నిజానికి ఈయన చేసిన అతడు సినిమాలో త్రివిక్రమ్ ఈయనని చాలా కొత్త గా చూపించారు.ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ తో ఆయన చేసిన పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ సినిమా తో మహేష్ మొదటి సారి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు.

    అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా ఇలియానా నటించింది.ఇక డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమా లో హీరోయిన్ గా మొదట కంగనా రనౌత్ ని అనుకున్నారట కానీ ఆమె వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం తో ఆమె ఈ సినిమాలో నటించలేకపోయారు.ఇక పోకిరి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడం తో కంగనా ఆ తర్వాత ఆ సినిమాని మిస్ చేసుకున్నందుకు చాలా రిగ్రెట్ అయినట్టు గా ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు.

    ఇక దాంతో పూరి ప్రభాస్ తో చేసిన ఏక్ నిరంజన్ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకున్నాడు ఈ సినిమా అంత పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.ఇక ప్రస్తుతం కంగనా రనౌత్ చంద్రముఖి 2 సినిమాలో నటిస్తుంది ఇందులో రాఘవ లారెన్స్ కి జోడి గా నటిస్తుంది ఇక ఈ సినిమా ఈనెల 28 న రిలీజ్ అవుతుంది…