Venkatesh And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఈ నలుగురు హీరోలే టాప్ హీరోలుగా వెలుగొందారు.ఇక ఎవరైనా వీళ్ళ తర్వాతే అనేలా వీళ్ళ హవా ఇండస్ట్రీలో కొనసాగింది. ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళు చేసే సినిమాలు కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి.
ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అయితే మాస్ సినిమాలు చేస్తూ మాస్ లో ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే వాళ్ళు అనుకున్నట్టుగానే మాస్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక హీరోయిన్ వెంకటేష్ కి సూపర్ సక్సెస్ ను అందించి బాలయ్య బాబుకి మాత్రం భారీ ప్లాప్ ను అందించింది. ఆమె ఎవరు అంటే ‘కత్రినా కైఫ్’… వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్ లో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ‘మల్లీశ్వరి ‘ సినిమాలో ‘కత్రినా కైఫ్’ హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమెకు మొదటి తెలుగు సినిమా కావడం విశేషం…ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ఆమెకు ఆ తర్వాత బాలయ్య బాబు పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం అయితే వచ్చింది.
జయంత్ సి పరంజి దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి పిడుగు’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందించకపోగా బాలయ్య బాబు కెరియర్ లోనే అది ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోవడం అనేది ఆయన కెరియర్ లో ఒక మాయని మచ్చగా మిగిలింది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇద్దరు సీనియర్ హీరోల్లో ఒకరికి మాత్రమే సూపర్ సక్సెస్ ని అందించి, మరొకరికి ఫ్లాప్ ని ఇవ్వడం పెద్ద చర్చనీయాంశం గా మారింది. ఇక ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇక మొత్తానికైతే వెంకటేష్ కి సూపర్ సక్సెస్ ని అందించి, బాలయ్య బాబుకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి…