https://oktelugu.com/

Heroine Sanghavi : హీరోయిన్ సంఘవిని మోసం చేసిన ఆ స్టార్ హీరో ఎవరంటే..?

అందుకే ఇండస్ట్రీ లో సక్సెస్ రాగానే కొమ్ములు వచ్చినట్టు గా ఫీలైపోకుండా, కొంచెం జాగ్రత్త గా సినిమాలు చేసుకుంటే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాలను గమనిస్తూ ఉండాలి.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2023 / 07:29 PM IST
    Follow us on

    Heroine Sanghavi : సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాణించడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఇక్కడ అవకాశాల కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ హీరోయిన్ గా రాణించడం చాలా కష్టం అనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోయిన్లు కొన్ని సినిమాలు చేసి వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీ లో హీరోయిన్లుగా నిలదొక్కుకుంటారు. అయితే అప్పట్లో చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం హీరోలతో ప్రొడ్యూసర్లతో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇక అందులో సంఘవి ఒకరు. ఆమె మొదటి సినిమాగా అజిత్ హీరోగా ఈమె హీరోయిన్ గా వచ్చిన అమరావతి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమాతోనే మంచి విజయాన్ని కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకి తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ అంతలోనే ఆమెకి మళ్లీ కొన్ని ప్లాప్ లు రావడంతో ఆమెకి వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి.

    దాంతో అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ తో కొన్ని సినిమాల్లో నటించింది దాంతో ఆమెకి విజయ్ కి మంచి సక్సెస్ లు వచ్చాయి. ఇక అప్పుడు వాళ్ల కాంబో లోనే విజయ్ వాళ్ళ నాన్న అయిన ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్షన్ లో చాలా సినిమాల్లో నటించి విజయ్ సంఘవి మంచి హీరో హీరోయిన్లు గా పేరు తెచ్చుకున్నారు. ఇక దాంతో విజయ్ సంఘవి కాంబో కి మంచి పేరు వచ్చింది. ఇక దానికి తోడు వీళ్ల మధ్య మంచి అండర్ స్టాండింగ్ కూడా ఏర్పడటంతో ఇద్దరు కలిసి సినిమా షూటింగ్ అయిపోగానే చెట్టాపట్టాలేసుకొని సిటీ అంత తిరిగేవారట, కొన్ని సార్లు అయితే విజయ్ సంఘవి డైరెక్ట్ గా సంఘవి రూమ్ కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్లీ ఇద్దరు కలిసి షూటింగ్ కి వచ్చేవారట దాంతో ఆ విషయం తెలుసుకున్న విజయ్ వాళ్ళ నాన్న సంఘవి కి వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇచ్చాడట… అయిన కూడా సంఘవి వినకుండా విజయ్ ని కలవడం చేయడం తో సంఘవి ఒప్పుకున్నా చాలా ప్రాజెక్టుల నుంచి తనని  తప్పించేసేలా చేసాడు. దాంతో సంఘవి చేతిలో సినిమాలు లేకుండా పోయాయి ఇక అయిన కూడా సంఘవి విజయ్ ని కలిసి పెళ్లి చేసుకుందాం అని చూసినప్పుడు విజయ్ కూడా సినిమాల్లో బిజీ గా ఉండి సంఘవి ని పట్టించు కోలేదట..

    ఇక దాంతో విజయ్ సంఘవి ల మ్యాటర్ తెలిసి ఎవరు కూడా ఆమెకి తమిళం లో ఛాన్స్ లు ఇవ్వకపోవడంతో మళ్లీ ఆమె తెలుగులోకి వచ్చింది. ఇలా సంఘవి ఒక స్టార్ హీరో చేతిలో మోసపోయి ఇలా తెలుగు ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. నిజంగా హీరోయిన్లు ప్రేమ పేరుతో ఇలా చాలా మంది హీరోలా చేతులో మోసపోతూ ఉంటారు.అందుకే ఇండస్ట్రీ లో సక్సెస్ రాగానే కొమ్ములు వచ్చినట్టు గా ఫీలైపోకుండా, కొంచెం జాగ్రత్త గా సినిమాలు చేసుకుంటే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాలను గమనిస్తూ ఉండాలి.