https://oktelugu.com/

Sridevi : బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీలో శ్రీదేవికి డూప్ గా నటించిన ఆ లేడి కమెడియన్ ఎవరో తెలుసా?

దేవకన్య పాత్ర చేస్తున్న శ్రీదేవి సెలయేరులో జలకాలు ఆడే సీన్లో నటించాలి. అయితే శ్రీదేవికి ఈత రాదు. ఆ సీన్ డూప్ తో చేయాలని రాఘవేంద్రరావు ఫిక్స్ అయ్యాడు.

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2023 / 09:54 AM IST
    Follow us on

    Sridevi : హీరోలే కాదు అప్పుడప్పుడు హీరోయిన్స్ కూడా డూప్ లను వాడుకుంటారు. యాక్షన్ సీక్వెన్సులు, రిస్కీ స్టంట్స్ లో డూప్స్ వాడకం తప్పనిసరి. అలాగే డ్యూయల్ రోల్ చేసినప్పుడు కూడా డూప్స్ అవసరం వస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ అవసరమైతే నటుడు సత్యనారాయణ చేసేవారు. ఒడ్డు పొడుగు వీరిద్దరూ ఒకేలా ఉంటారు. అందుకే ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తే సత్యనారాయణను రంగంలోకి దింపేవారు.

    ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవికి డూప్ గా నటుడు ప్రసాద్ బాబు చేశాడు. హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్ గా శ్రీకాంత్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదహారణలు ఉన్నాయి. కాగా శ్రీదేవికి లేడీ కమెడియన్ హేమ డూప్ గా చేయడం ఊహించని పరిణామం. టాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద హిట్ గా ఉన్న జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో శ్రీదేవి డూప్ గా హేమ నటించిందట.

    కెరీర్ బిగినింగ్ లో హేమ సిస్టర్స్, సపోర్టింగ్ రోల్స్ చేసేది. చిరంజీవి హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు జగదేకవీరుడు అతిలోకసుందరి చేస్తున్నారు. హీరోయిన్ గా శ్రీదేవి నటించింది. దేవకన్య పాత్ర చేస్తున్న శ్రీదేవి సెలయేరులో జలకాలు ఆడే సీన్లో నటించాలి. అయితే శ్రీదేవికి ఈత రాదు. ఆ సీన్ డూప్ తో చేయాలని రాఘవేంద్రరావు ఫిక్స్ అయ్యాడు.

    నటి హేమకు ఈత వచ్చని తెలిసిన దర్శకుడు శ్రీదేవికి డూప్ గా జలకాలు ఆడే సీన్లో ఆమెను నటింపజేశాడు. 1990లో విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే రూ. 15 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది. ఇళయరాజా సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.