https://oktelugu.com/

Tollywood Top Heroes: టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోలు ఎవరు? వారి రేటు ఎంత?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు పవన్.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 12, 2023 / 05:27 PM IST
    Follow us on

    Tollywood Top Heroes: తెలుగు సినిమా అంతే ప్రాంతీయ సినిమా కాదు. పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా అనే రేంజ్ కు ఎదిగింది. తెలుగు సినిమా వస్తుందంటే.. ఇతర ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అందరి ఆసక్తి మాదిరిగానే తెలుగు సినిమాలు వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి ఆర్ ఆర్ ఆర్ వరకు సత్తా చాటాయి. దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి మన స్టార్లు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? పాన్ ఇండియా రేంజ్ లో రెమ్యూనరేషన్ లు.. ఇతర ఇండస్ట్రీని ఢీ కొట్టే సినిమాలతో దూసుకొని పోతున్నారు మన హీరోలు.

    బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. దీంతో ప్రతి సినిమాకు వంద కోట్లకు పైగానే ఛార్జ్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఆదిపురుష్ కోసం రూ. 150 కోట్ల వరకు తీసుకున్నారు ప్రభాస్. ఇక సలార్ రెండు పార్ట్‌ల కోసం రూ. 300 కోట్ల వరకు తీసుకుంటున్నారట.దీంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఈయన పేరు ముందుంటుంది. షారుఖ్ ఖాన్, ప్రభాస్ మధ్య పోటీ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు పవన్. హరిహర వీరమల్లు కోసం రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మిగిలిన సినిమాలకు కూడా రూ. 50 కోట్లు అందుకుంటున్నారట పవన్.పవన్ ప్రస్తుతం ఒక్క రోజు షూటింగ్ కు రూ. 2 కోట్లు తీసుకుంటున్నట్టు తెలిపారు.

    మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాకు రూ 55 కోట్లు తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత గుంటూరు కారంతో రానున్నారు మహేష్. ఈ సినిమాకు కూడా ఎక్కువగానే అందుకుంటున్నారు. ఇక ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉండనుంది. దీని కోసం రూ. 100 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకోసం జూ. ఎన్టీఆర్ రూ. 50 కోట్లు అందుకున్నారట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు రూ. 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట తారక్. ఇక హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తోన్న ‘వార్ 2’ సినిమా రూ. 120 వరకు పారితోషకం అందుకోబోతున్నట్టు సమాచారం.

    రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఏకంగా రూ. 50 కోట్లు అందుకున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం రూ. 60 కోట్ల వరకు అందుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ .. బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాకు కూడా అధికంగతానే అందుకోనున్నారట.

    పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. పుష్ప సక్సెస్ తో పుష్ప 2 కోసం రూ. 90 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో చేయబోతున్న సినిమా కోసం రూ. 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట బన్నీ.