https://oktelugu.com/

Tollywood Actors: అనుకోకుండా యాక్టర్లు అయిన వాళ్ళు ఎవరంటే..?

నాచురల్ స్టార్ నాని కూడా మొదట్లో డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోగా మారి మంచి గుర్తింపుని తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హీరోగా ఉన్న ఆయన పేరుని సుస్థిరం చేసుకుంటున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే కెరియర్ లో మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

Written By: , Updated On : October 4, 2023 / 07:08 PM IST
Tollywood Actors:

Tollywood Actors:

Follow us on

Tollywood Actors: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటులు వాళ్ళు నటించే సినిమాల పట్ల చాలా కృతజ్ఞత భావాన్ని చూపిస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలని సద్వినియోగ పరుచుకుంటూ చిన్న చిన్నగా ఎదిగి ఆ తర్వాత ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న నటులలో వెన్నెల కిషోర్ ఒకరు.

ఈయన ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చాడు కానీ దేవకట్ట డైరెక్షన్ లో వచ్చిన వెన్నెల సినిమాకి రైటర్ గా కూడా చేశాడు. ఇక దానితో పాటు ఆ సినిమా లో ఒక క్యారెక్టర్ కోసం చాలామందిని చూసినప్పటికీ ఎవరు సెట్ కాకపోవడంతో ఆ క్యారెక్టర్ కి వెన్నెల కిషోర్ ను సినిమా లో పెట్టీ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది. ఆయనకు వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఆయన సినిమాల్లో బిజీ అయిపోయాడు. ఇలా ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చి ఆ తర్వాత మారి తెలుగులో టాప్ కామెడీయన్ గా ప్రస్తుతం ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు.అందరికి ఈయన వరుసగా సినిమాలు చేస్తూ చిన్న పెద్ద హీరో అని తేడా లేకుండా ప్రతి హీరో సినిమాలో కామెడీ యాక్టర్ గా చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు మంచి సంపాదించుకుంటున్నాడు. ఈమధ్య ఏ సినిమాలో చూసినా కూడా వెన్నెల కిషోర్ తనదైన మార్క్ నటనతో థియేటర్ లో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తున్నాడు. ఇక వెన్నెల కిషోర్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లను కూడా అందుకుంటున్నాడు ఆయన ఇండస్ట్రీలో హీరో గా మారి మంచి నటుడిగా సెట్ అయిపోయారు…

ఇక నాచురల్ స్టార్ నాని కూడా మొదట్లో డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోగా మారి మంచి గుర్తింపుని తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హీరోగా ఉన్న ఆయన పేరుని సుస్థిరం చేసుకుంటున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే కెరియర్ లో మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…

ఇలా ఇండస్ట్రీకి వచ్చి తనదైన మార్కు నటనతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాధా గోపాలం అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక శీను వైట్ల దగ్గర కూడా కొద్ది రోజులపాటు పని చేశాడు.ఆ తర్వాత అష్ట చమ్మ సినిమా తో హీరోగా మారాడు ఇక దానికి తోడుగా ఆయన వరుసగా సినిమాలు చేశాడు. అలా చేస్తూనే ఈయన చాలా సక్సెస్ హీరో గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు…