Pushpa 2
Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినిమాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2)ఒకటి బాహుబలి 2(Bahubali 2) 1810 కోట్లతో పాన్ ఇండియాలో భారీ రికార్డును క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే ఇక ఆ రికార్డును కొల్లగొడుతూ 1871 కోట్ల వరకు కలెక్షన్స్ ని వసూలు చేసింది అంటూ రీసెంట్ గా ఈ సినిమా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమా కలెక్షన్స్ ని ఇంతవరకు గోప్యంగా ఉంచడానికి గల కారణం ఏంటి అంటే గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పైన ఐటీ రైడ్స్ అయితే జరిగాయి. భారీ కలెక్షన్స్ వచ్చాయని ప్రకటించడంతోనే ఈ రైడ్స్ అయితే జరిగాయి. దానివల్ల అప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ యాడ్ చేసిన తర్వాత కూడా ఈ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ అయితే రాలేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అందువల్లే 1861 కోట్ల వరకు కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టి అక్కడితో ఆగిపోయింది.
ఇక దంగల్ (Dhangal) సినిమా 2024 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. మరి ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా రెండు వేల కోట్ల మార్క్ ను టచ్ చేస్తుంది అనుకున్న ప్రతివారికి నిరాశనే మిగిలింది. బాహుబలి రికార్డును బ్రేక్ చేయగలిగింది కానీ దంగల్ రికార్డు మాత్రం అసలు టచ్ చేయలేకపోయింది.
ఇక ఈ సినిమాలో సుకుమార్ తన మార్క్ మేకింగ్ తో అలరించాడు. అలాగే అల్లు అర్జున్ తన హీరోయిజం ను ఎలివేట్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా 1800 కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుందని ఎవరు అంచనా కూడా వేయలేదు. కానీ అంతటి ఘన విజయాన్ని సాధించి భారీ కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సాధించిన విజయం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరోసారి భారీ ఎత్తున బుస్టాప్ ఇచ్చిందనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కాబట్టి వాళ్ళు చేసే సినిమాలతో రికార్డ్ లను బ్రేక్ చేసే విధంగా కథలను రాసుకోవాలనే ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా అదే కేటగిరీకి చెందిన వాడు కావడం విశేషం…