Sukumar rejected by star hero: సినిమా ఇండస్ట్రీలో ఒక కథ రాసుకొని, దానికి సరిపడా హీరోను సెలెక్ట్ చేసుకొని అతనికి చెప్పి ఒప్పించి సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని…ఈ ప్రాసెస్ లో ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగిన సినిమా ఆగిపోతోంది. ఇక ఇదంతా ఒకెత్తయితే ఆ సినిమాని సక్సెస్ఫుల్గా నిలపడం మరొకెత్తు. ఒకసారి సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ వచ్చిందంటే చాలు దర్శకుడికి ఇండస్ట్రీలో చాలా గొప్ప అవకాశాలైతే వస్తాయి. అలాగే తను చేస్తున్న సినిమాలను గొప్ప రేంజ్ లో చూపించే ప్రయత్నం చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ లాంటి ఇంటలిజెంట్ డైరెక్టర్ కెరీర్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కున్నాడు. ఆర్య సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కథలను సిద్ధం చేసుకున్నాడు. అయినప్పటికి తనకు అవకాశం రాలేదు. దాంతో చిన్న హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లో సుకుమార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చాలా సన్నాహాలైతే చేశాడు. కానీ అప్పటికే ఆయన చాలా సినిమాలకు కమిట్ అయి ఉండటం వల్ల అవకాశం దొరకలేదు. ఇక ఆ తర్వాత కూడా ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నం చేయలేదట.
కారణం ఏంటి అంటే ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల ఇతర హీరోలతో సినిమాలు చేయడానికి అతనికి సమయం సరిపోతుందని వేరే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించలేదని చెప్పాడు… రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ని టాప్ లెవెల్లో నిలబెట్టిన ఆయన ఆ తర్వాత చేసిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ను మార్చేశాడు.
ఐకాన్ స్టార్ గా తనకు కొత్త ట్యాగ్ ఇచ్చి దానికి తగ్గ న్యాయాన్ని చేసేలా ఆ సినిమాలో చూపించాడు. మొత్తానికైతే అల్లు అర్జున్ అభిమానులు సైతం సుకుమార్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు. ఎందుకంటే అల్లు అర్జున్ కెరియర్ లో సుకుమార్ చేసిన నాలుగు సినిమాలు అతనికి చాలా కీలకమైన సినిమాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు.
ఆ సినిమాలు లేకపోతే అల్లు అర్జున్ ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదని అందువల్లే సుకుమార్ అంటే వాళ్లకి అమితమైన ప్రేమ అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రేమను ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు…ఇక ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేస్తున్న సుకుమార్ వీలైనంత తొందరగా సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…