Diwali Winner: ఒక సినిమా కోసం చాలా మంది టెక్నీషియన్స్ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ క్రాఫ్ట్ లో వాళ్లు 100% ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తూ ఆ మూవీ ని సక్సెస్ తీరాలకు చేర్చడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తారు. ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో అన్ని సినిమాలు విజయాన్ని సాధిస్తాయనే గ్యారంటీ లేదు. కొన్ని సినిమాలు మాత్రమే విజయ తీరాలకు చేరుకుంటాయి…ఇక ఈ దీపావళికి ఈ వారం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి… వాటిలో ఏ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది… ఏ మూవీ డిజాస్టర్ గా నిలిచిందనేది మనం ఒక సారి తెలుసుకుందాం…
మిత్ర మండలి
ప్రియదర్శి మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చినప్పటికి ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది…జాతి రత్నాలు ఫ్లేవర్ తో వచ్చి డిజపాయింట్ చేసింది…
డ్యూడ్
ప్రదీప్ రంగనాథన్ మెయిన్ లీడ్ లో వచ్చిన డ్యూడ్ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది…పాటలు, కామెడీ, ఎమోషన్ తో ఒక ఊపు ఊపేసింది…ఇక ఇంతకు ముందు ఆయన చేసిన డ్రాగన్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ గుర్తింపు తో మరోసారి డ్యూడ్ తో విజయాన్ని అందుకున్నాడు…
తెలుసు కదా
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన తెలుసు కదా సినిమా నిన్న రిలీజ్ అయింది… గతంలో సిద్దు డీజే టిల్లు తో మంచి విజయాన్ని అందుకున్నాడు. మధ్యలో జాక్ ప్లాప్ అయిన కూడా తెలుసు కదా సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది…కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది… కథ బాగున్నప్పటికీ ప్రజెంటేషన్ వీక్ అయింది…
Also Read: తాగుబోతు హీరో – మెంటల్ హీరోయిన్ తో ఆడియన్స్ కు K-ర్యాంప్
కే ర్యాంప్
కిరణ్ అబ్బవరం క సినిమాతో మంచి ఊపులోకి వచ్చాడు.గత సంవత్సరం దీపావళికి క మూవీ ని రిలీజ్ చేశాడు…ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో సెంటిమెంట్ గా ఈ దీపావళికి కే ర్యాంప్ సినిమాను రిలీజ్ చేశాడు…ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది…రొటీన్ సీన్స్ తో ఆడియన్స్ కి బోర్ కొట్టించింది…
ఇక ఈ దీపావళికి వచ్చిన నాలుగు సినిమాల్లో డ్యూడ్ మూవీ విజయం సాధించింది…ఇప్పుడు ఆ మూవీ కె ఎక్కువగా థియేటర్లను కేటాయిస్తుండటం విశేషం…