
Senior NTR: భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు చిత్రసీమకు మంచి గుర్తింపు దక్కింది అంటే.. కారణం మన తెలుగు పౌరాణిక చిత్రాలే. ఎందుకంటే.. ఏ భాషలో లేని రాని ఎన్నో గొప్ప పౌరాణిక చిత్రాలు తెలుగు తెర పై ఎన్నో ఏళ్ళ పాటు ఏలాయి. సీనియర్ ఎన్టీఆర్ అద్భుత నటనతో అన్ని రకాల పౌరాణికాలు తెలుగు లోగిళ్లలో వెలిశాయి. మరో భాషకు తెలుగు భాషకు ఇదే తేడా. హిందీ, తమిళ, కన్నడ ఇలా అన్ని భాషల హీరోలు.. పౌరాణిక చిత్రాల విషయంలో ఎన్టీఆర్ ను ఫాలో అయ్యేవారు.
అందుకే, అప్పట్లో పౌరాణికం అంటే ఒక్క ఎన్టీఆరే గుర్తుకు వచ్చేవారు. కానీ జనరేషన్ లు మారాయి. మనుషులు కూడా మారిపోయారు. దాంతో సినిమాల శైలి మారింది, సినిమాల నేపథ్యాలు మారిపోయాయి. అయితే, పౌరాణిక చిత్రాలకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఇప్పుడున్న అద్భుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. మళ్ళీ అలనాటి పౌరాణిక కథలను గొప్ప గాథలను మరింత గొప్పగా తెరకెక్కించి నేటి ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలని ఇప్పటి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ఆదిపురుష రెడీ అవుతుంది. ఇక మహాభారతాన్ని ఎన్నటికీ అయినా మళ్లీ తీయాలన్నది రాజమౌళి ఆశయం. అయితే, తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రామాయణం తీయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టారు. ఓం నమో వెంకటేశాయ తరవాత రాఘవేంద్రరావు మ ళ్లీ దర్శకత్వం చేయలేదు.
కానీ ఇప్పుడు ఆయన రామాయణంను సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ హంగులతో, స్టార్ నటీనటులతో రాయామణం గాథని చూపించాలని ఆయన ఫిక్స్ అయ్యారు. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. మరి హీరోలు ఎవరు నటిస్తారో చూడాలి. స్టార్లు లేకపోతే.. ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కదు.
కాబట్టి.. ఎట్టిపరిస్థితుల్లో స్టార్లను ఒప్పించాలని రాఘవేంద్రరావు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, ఇప్పటి వరకూ వెండి తెరపై రామాయణ గాథను ఎన్నోసార్లు తెలుగు ప్రేక్షకులు తనివితీరా చూసేశారు. మరి ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించడానికి ఏముంది ? పైగా రాముడిగా ఎన్టీఆర్(Senior NTR) ను చూశాం, ఇక ఏ హీరో మాత్రం తెలుగు కళ్ళను సంతృప్తి పరచగలడు ?
Also Read: ఎన్టీఆర్ పై రాజమౌళి సెటైర్లు !