Chiranjeevi: సౌత్ ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే తెలియని వారుండరు. తెలుగు సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అయితే ఆమధ్య కొన్నిరోజుల పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నారు. 60 పడిలో పడినా యంగ్ హీరోలకు పోటీనిస్తూ సినిమాలు చేస్తున్నా మెగాస్టార్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘బోళా శంకర్, మూవీతో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ కు చెందిన ఓ వీడియో హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో ఎంత బిజీ ఉన్నా చిరు ఆహారం విషయంలో మాత్రం టేక్ కేర్ గా ఉంటారు. ఇష్టమైన తిండిని తప్పకుండా తీసుకుంటారు.
వాల్తేరు వీరయ్య సినిమా తరువాత మెగాస్టార్ బిజీగా మారారు. ప్రస్తుతం ఆయన ‘భోళా శంకర్’ సినిమాతో బిజీగా మారారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేష్ నటిస్తున్నారు. అలాగే తమన్నా కూడా ఉన్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్లలో వస్తున్న ఈ మూవీ ని క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
షూటింగ్ లేని సమయంలో చిరంజీవి ఎక్కువగా వంట గదిలోనే కాలక్షేపం చేస్తారు.అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఓ సందర్భంలో మెగాస్టార్ బిర్యానీ చేసి ఆకట్టుకున్నారు. ఆయన చేతి వంట తినాలని ఎదురుచూస్తూ ఉంటామని మెగా హీరోలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ఓసారి తన తల్లి కోసం ప్రత్యేకంగా దోశెలు వేసి తినిపించారు. ఒక తల్లికి కొడుక్కు ఇచ్చే అతిపెద్ద మర్యాద ఇదే అంటే క్యాప్షన్ పెట్టడం విశేషం.
కరోనా సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండకుండా చిరంజీవి వంటగదిలో ప్రత్యక్షమయ్యారు. ఇంట్లో వాళ్ల కోసం ప్రత్యేకంగా వంటకాలు చేసి ఆకట్టుకున్నారు. అయితే ఆయనకు ఏ వంట ఇష్టం? అనే చర్చ హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో తాజాగా ఈ వీడియోలో ఓ వ్యక్తి సంచలన కామెంట్స్ చేశారు. చిరంజీవి గారికి చేపలంటే ఇష్టమని, మరీ ముఖ్యంగా బొమ్మడాయిల చేపలంటే విపరీతంగా ఇష్టమని చెప్పారు. తాను చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి నెల్లూరులో ఉండేవారని, అక్కడ వారి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి బొమ్మడాయిల చేపలు ఇచ్చేవాడినని చెబుతున్నారు. అందుకు సంబంధించిన పూర్తీ వీడియోను మీరూ చూడండి..
https://fb.watch/k7MUF4uxJK/?mibextid=6aamW6
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Which fish does chiranjeevi like where did they bring it from
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com