Bheemla Nayak Movie: టాలీవుడ్ ను ఇప్పుడు ‘భీమ్లానాయక్’ షేక్ చేసింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ పౌరుషంగా దిగితే ఏం జరుగుతుందో ఈ చిత్రం నిరూపించింది. ఈ క్రమంలోనే భీమ్లానాయక్ మూవీని కొట్టే సినిమా ఏదన్నది ఇప్పుడు టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాధేశ్యామ్, సర్కారి వారి పాట, ఆచార్య సినిమాలో దేనికి అత్యధిక కలెక్షన్లు రాబడుతుందనే దానిపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
టాలీవుడ్ కు ‘భీమ్లానాయక్’ ఓ ఊపు వచ్చింది. ఆ ఊపును కంటిన్యూ చేయడానికి ఇప్పుడు వరుసగా సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. కరోనా కల్లోలం పోయి థియేటర్లలో ఆక్యూపెన్సీ ఆంక్షలు పోయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక భారీ బడ్జెట్ అయిన ఆర్ఆర్ఆర్ ను వదిలేస్తే.. ఇక సర్కారి వారి పాటను ఏప్రిల్ లో రిలీజ్ కు ఫిక్స్ చేశారు. చిరంజీవి ‘ఆచార్య’ను కూడా ఈ రెండింటి మధ్యలో విడుదల చేస్తున్నారు.ఇక ప్రభాస్ రాధేశ్యామ్ ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో మార్చి, ఏప్రిల్ లోనే సినిమా రిలీజ్ చేయనున్నారు.
Also Read: Bheemla Nayak Box Office Collections: భీమ్లానాయక్ కి నైజాంలో తిరుగులేని రికార్డ్
భీమ్లానాయక్ ను బీట్ చేసే సినిమాలు రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. అందులో ‘ఆర్ఆర్ఆర్’, రాధేశ్యామ్ మాత్రమే. ఎందుకంటే ఇవి ప్యాన్ ఇండియా మూవీలు. ఈ రెండు చిత్రాలకు దేశవ్యాప్తంగా బజ్ ఉంది. మార్కెట్ ఉంది. దీంతో భీమ్లానాయక్ ను కొట్టే సినిమాలు ఈ రెండూ..
ఇక తెలుగులో చూసుకుంటే ‘సర్కారివారి పాట’, ఆచార్య మూవీలకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెండు తెలుగు మార్కెట్ లోనే ఆడుతాయి. కాబట్టి హిట్ అయితే భీమ్లానాయక్ మూవీని చేరుకోవచ్చు. ప్రస్తుతానికి రాబోయే నాలుగు చిత్రాల్లో ఏదీ భీమ్లానాయక్ ను కొడుతుందనే దానిపై మీ కామెంట్ ను కింద కామెంట్ లో జతచేయండి.
Also Read: రానా ఇన్ని సూపర్ హిట్ మూవీలు వదులుకున్నాడా.. అవన్నీ చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడేమో..