Ghaati movie mistakes: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి దక్కినటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరు చేస్తున్న సినిమాలతో మంచి పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే అనుష్క లాంటి నటి సైతం అరుంధతి సినిమాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ను సాధించింది. అప్పటినుంచి ఆమెకు చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ఘాటి సినిమా చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయంలోనే ఇపుడు సందిగ్ధమైన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది సినిమా అనుకున్నంత రేంజ్ లో లేదని మాట్లాడుకుంటున్నారు.
కారణం ఏంటి అంటే ఘటి వరల్డ్ ని పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు చాలా వరకు తడబడ్డాడు. అందువల్లే ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుడికి అయితే ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేకపోయింది…
ఇక క్రిష్ సైతం ఈ సినిమాని డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అది ఆశించిన మేరకు ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఇక అనుష్కను సైతం సెకండాఫ్ లో వాడుకున్న విధానం అంతా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ప్రతి షాట్ లో ఆమె లావుగా ఉందనే విషయం అయితే మనకు ఈజీగా తెలిసిపోతోంది.
అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు.ఈ సినిమాకి అనుష్క ప్లస్ అవుతోంది అనుకున్నారు. కానీ ఆమెనే మైనస్ అయిందనే చెప్పాలి… ఇక కొన్ని నాసిరక మైన సీన్స్ రాయడం, ఎమోషనల్ గా ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోవడం వల్ల అవి సినిమా మీద భారీ ఎఫెక్ట్ అయితే చూపించాయి…అలాగే విలన్ పాత్రలో చైతన్య రావు సైతం సరిగ్గా సెట్ అవ్వలేదు…ప్రతి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది…