Sandeep Reddy Vanga: బాలీవుడ్ లో ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఏ సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని సినిమాలు మాత్రం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక సినిమా రిలీజ్ కి ముందు సెన్సార్ వాళ్లు ఆ సినిమాను చూసి దానికొక సర్టిఫికెట్ ఇస్తారు.
ఏ ఏజ్ గ్రూపు వాళ్ళు ఎలా ఈ సినిమాని చూడాలి అనే దాని మీద ఆ సర్టిఫికెట్ అయితే ఇస్తారు. ముఖ్యంగా యు సర్టిఫికెట్ వస్తే అందరూ ఆ సినిమాని చూడవచ్చు.అలా కాకుండా యూ బై ఏ సర్టిఫికేట్ వచ్చినట్టయితే 18 సంవత్సరాల లోపు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఆ సినిమాలు చూడాలి. అలా కాకుండా ఏ సర్టిఫికెట్ కనక వచ్చినట్టయితే 18 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే ఆ సినిమాలు చూడాలి అని దాని అర్థం. అంటే ఆ సినిమాలో వైలెన్స్ గానీ, లేదా కంటెంట్ లో బోల్డ్ నెస్ గానీ ఎక్కువ గా ఉన్నాయని అర్థం.ఇక ఆ సినిమా సబ్జెక్ట్ ని బట్టి సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ సినిమాకి ఆ సర్టిఫికెట్ ని ఇస్తుంటారు.
అయితే ఏ సర్టిఫికెట్ తో వచ్చిన సినిమాల్లో టాప్ 5 కలక్షన్స్ ని రాబట్టిన సినిమాల్లో టాప్ 2 సినిమాలు సందీప్ రెడ్డి వంగ సినిమాలే కావడం విశేషం…ప్రస్తుతం ఆయన రణ్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమా 660 కోట్ల వరకు కలక్షన్లను రాబట్టగా ఈ సినిమా ఏ సర్టిఫికెట్ తో వచ్చి హైయెస్ట్ కలక్షన్స్ ని వసూలు చేసిన సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ షాహిద్ కపూర్ తో తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ గా తీసిన కబీర్ సింగ్ సినిమా 370 కోట్లను కలెక్ట్ చేసి నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక అలాగే కాశ్మీర్ ఫైల్స్ సినిమా 340 కోట్ల కలక్షన్లు రాబట్టి నెంబర్ త్రీ పొజిషన్ లో కొనసాగుతుంది. ఆ తర్వాత కేరళ స్టోరీస్ సినిమా 300 కోట్ల కలక్షన్లు రాబట్టి నాలుగో ప్లేస్ లో నిలిచింది. అలాగే అక్షయ్ కుమార్ దేవుడిగా వచ్చిన ఓ మై గాడ్ సినిమా కూడా ఏ సర్టిఫికెట్ తో రావడం విశేషం…
ముఖ్యంగా దేవుడికి సంబంధించిన కాన్సెప్ట్ అయిన ఈ సినిమాకి ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో ఎవరికి అర్థం కాలేదు. అయినప్పటికీ ఈ సినిమా 229 కోట్ల కలక్షన్లు రాబట్టి నెంబర్ 5 పొజిషన్ లో కొనసాగుతుంది…అంటే సందీప్ వంగ డైరెక్షన్ లో వచ్చిన రెండు సినిమాలు టాప్ 5 సినిమాల్లో టాప్ 2 లో ప్లేస్ దక్కించుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. నిజానికి ఏ సర్టిఫికెట్ తో వచ్చిన సినిమాల్ని చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరు కాబట్టి అలాంటి సినిమాలకి కలక్షన్లు కూడా ఎక్కువగా రావు.అయిన కూడా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసి కలక్షన్ల సునామిని సృష్టించాడు అంటే నిజంగా ఆయన ఒక తోపు డైరెక్టర్ అనే చెప్పాలి…