https://oktelugu.com/

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ రావాల్సిందే అంటున్న ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ అప్పుడేనా?

Bheemla Nayak: పాన్ ఇండియా ఫిల్మ్స్ ‘ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వాటికి చోటు ఇవ్వడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం సినీ ఇండస్ట్రీలో ఉంచేందుకుగాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్ర విడుదల తేదీని మార్చేశారు. ఈ నెల 12న విడుదల కావాల్సిన పిక్చర్‌ను వచ్చే నెల 25కు మార్చారు. అయితే, అనూహ్యంగా ఈ నెల 7న విడుదల కావాల్సిన […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 2, 2022 / 03:14 PM IST
    Follow us on

    Bheemla Nayak: పాన్ ఇండియా ఫిల్మ్స్ ‘ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వాటికి చోటు ఇవ్వడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం సినీ ఇండస్ట్రీలో ఉంచేందుకుగాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్ర విడుదల తేదీని మార్చేశారు.

    Bheemla Nayak

    ఈ నెల 12న విడుదల కావాల్సిన పిక్చర్‌ను వచ్చే నెల 25కు మార్చారు. అయితే, అనూహ్యంగా ఈ నెల 7న విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో నెలకొన్ని పరిస్థితుల వలన రిలీజ్ వాయిదా వేశామని, త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు.

    Also Read: ఉస్తాద్​ లెక్కున్నాడుగా.. ‘భీమ్లానాయక్​’ కొత్త పోస్టర్​పై నెటిజన్లు కామెంట్స్​

    ఈ క్రమంలోనే ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ ఈ నెల 12న విడుదల చేయాలని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. నిజానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 12న పిక్చర్ విడుదల చేయాలని ‘భీ మ్లా నాయక్’ టీమ్ ప్రయత్నించింది. కానీ, పోస్ట్ పోన్ నేపథ్యంలో మూవీ యూనిట్ సభ్యులు కొంత రిలాక్స్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మళ్లీ విడుదల తేదీని ప్రీ పోన్ చేయడం కుదరదని అంటున్నట్లు తెలుస్తోంది.

    ఫిల్మ్‌ను 12న విడుదల చేయడానికి ఎంత కష్టపడినా అది ఇక సాధ్యం కాదని మూవీ యూనిట్ సభ్యులు అంటున్నట్లు టాక్. వచ్చే నెల 25 వరకు సినిమా కోసం వెయిట్ చేయాలని తెలిపినట్లు వినికిడి. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల పోస్ట్ పోన్ చేస్తారనే విషయం ముందే తెలిసి ఉంటే కంపల్సరీగా ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో ఉండేదని పలువురు పవన్ కల్యాణ్ అభిమానులు అంటున్నారు. ‘భీమ్లా నాయక్’ ఫిల్మ్ రిలీజ్ పోస్ట్ పోన్ చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్ గిల్డ్ ‘భీమ్లానాయక్’ మూవీ యూనిట్ సభ్యులు, డైరెక్టర్ సాగర్. కె.చంద్ర, త్రివిక్రమ్ శ్రీనివాస్ , పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్.

    Also Read: పవన్ కళ్యాణ్ రికార్డును తుడిచిపెట్టిన విజయ్ దేవరకొండ !

    Tags