Puri Jagannadh Beggar movie: ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… సినిమా స్టార్ట్ చేసిన రోజే రిలీజ్ డేట్ చెప్పే ఘట్స్ ఉన్న డైరెక్టర్ కూడా తనే కావడం విశేషం… మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సైతం కేవలం 75 రోజుల్లోనే బిజినెస్ మేన్ లాంటి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన రికార్డు కూడా అతని పేరు మీదనే ఉంది…ఫాస్ట్ గా సినిమాలు తీసి సూపర్ సక్సెస్ ని సాధించడం ఎలా అనేది పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
చాలామంది అదే బాట లో నడవాలనే ప్రయత్నం చేసిన కూడా అది అందరికి సాధ్యమవ్వలేదు. అలాంటి పూరి జగన్నాథ్ ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడు. దానివల్ల కొంతవరకు సతమతమవుతున్నాడు. అయినప్పటికి విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ఆయన చేస్తున్న ‘బెగ్గర్’ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది.
తొందరలోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లేదు. ఈ సినిమా నుంచి టీజర్ ని తొందర్లో రిలీజ్ చేస్తామంటూ పూరి జగన్నాథ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన బౌన్స్ బ్యాక్ అయి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశాన్ని అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో బెగ్గర్ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేస్తారట.
అసలు బెగ్గర్ సినిమా స్టోరీ ఏంటి విజయ్ సేతుపతి ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. మొత్తానికైతే ఆయన పంథా మార్చి కొత్త వే లో ఈ సినిమాని చేస్తున్నాడా? వీటన్నింటికి క్లారిటీ రావాలంటే టీజర్ రిలీజ్ అవ్వాల్సిందే అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు..