https://oktelugu.com/

అదే ‘వి’ సినిమా కొంప ముంచిందా?

హీరోలు నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ‘వి’ చిత్రం నిన్ననే ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘వి’ సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు తొలుత మొగ్గుచూపాడు. అయితే అమెజాన్ ప్రైమ్ మంచి ధర ఇవ్వడం.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘వి’ మూవీని ఓటీటీ రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపారు. Also Read: థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా? నాని 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 12:18 PM IST

    Nani V movie

    Follow us on


    హీరోలు నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ‘వి’ చిత్రం నిన్ననే ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘వి’ సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు తొలుత మొగ్గుచూపాడు. అయితే అమెజాన్ ప్రైమ్ మంచి ధర ఇవ్వడం.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘వి’ మూవీని ఓటీటీ రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపారు.

    Also Read: థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా?

    నాని 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాకు ముందు విడుదలైన ట్రైలర్, టీజర్, ఫస్టు లుక్ వంటిలో హీరో నానిని, సుధీర్ బాబు డిఫరెంట్ చూపించారు. దీంతో ఈ సినిమా మంచి కంటెంట్ తో వస్తుందని అంతా భావించారు. అయితే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాత్రం టాలీవుడ్లో ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా వచ్చిన పాతకథనే రోటిన్ గా తెరపై చూపించాడు.

    గత మూడునెలలుగా టాలీవుడ్ నుంచి ఒక్క భారీ సినిమా కూడా ఓటీటీ రాలేదు. ‘వి’ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి మంచి ప్రచారం చేసింది. హీరోయిన్లు నివేదా థామస్, అదితిరావులు కూడా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా మాత్రం ఎక్కడా ప్రేక్షకులను అంచనాలను అందుకోలేక మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

    Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

    దర్శకుడు ఇంద్రగంటితో నాని చేసిన సినిమాలకు భిన్నంగా ‘వి’ని తెరకెక్కించారు. ఇంద్రగంటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. నాని, సుధీర్ బాబులను కొత్త తరహాలో చూపించాడు. అయితే సినిమాలో సెకాండాఫ్ ఫ్లాప్ బ్యాక్, ట్వీస్టులు, డ్రామా లేకపోవడం, క్లైమాక్స్ ఆకట్టుకోలేక పోవడంతో సినిమా ప్లాపు టాక్ సొంతం చేసుకుంది. సినిమాపై పెరిగిన విపరీతమైన అంచనాలు కూడా సినిమాను దెబ్బతిసినట్లు తెలుస్తోంది. ‘వి’ సినిమాను నిర్మాత దిల్ రాజు ఓటీటీకి ఇచ్చి సేఫ్ జోన్లోకి వెళ్లాడనే అభిప్రాయం టాలీవుడ్ సర్కిల్స్ లో విన్పిస్తోంది.