Mahesh Babu: దేవతలు సైతం పూజింపబడే దేవుడు వినాయకుడు. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా వినాయకుడికి పూజలు చేసి మొదలు పెట్టాలి. మన టాలీవుడ్ హీరోలు కూడా వినాయకుడి మీద ఎన్నో పాటలు, సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నిన్నటి తరం హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి వారు చిరకాలం గుర్తించుకోదగ్గ వినాయకుడి కి సంబంధించిన పాటలను మన టాలీవుడ్ కి అందించారు. అయితే నేటి తరం హీరోలలో ఏమైందో ఏమో తెలియదు కానీ, విగ్నేశ్వరుడికి సంబంధించి గుర్తించుకోదగ్గ ఒక్క పాటని కూడా మన టాలీవుడ్ ఆడియన్స్ కి అందించలేదు. కానీ మహేష్ బాబు మాత్రం అందించాడు. పోకిరి సినిమాలోని ‘జగడమే’ అనే పాటలో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ అద్భుతమైన బీట్ కి డ్యాన్స్ చేస్తాడు. చిన్న బిట్ అయినప్పటికీ కూడా, ఇప్పటికీ వినాయక చవితి వచ్చిందంటే చాలు ఈ పాట వినాయకుడి విగ్రహాల దగ్గర మోగాల్సిందే. అంతటి ప్రభావం చూపించింది ఈ బిట్. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు కి ‘పోకిరి’ సినిమాకి ముందు చాలా ఫ్లాప్స్ వచ్చాయి.
‘అతడు’ చిత్రం ఒక మోస్తారుగా ఆడినప్పటికీ, ఆయన ఇమేజి ని పెంచే సినిమా మాత్రం పడడం లేదు. అలా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆయనకీ పోకిరి చిత్రం తగిలింది. ఈ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి సునామీ ని బాక్స్ ఆఫీస్ దగ్గర నెలకొల్పిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని తిరగరాసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. మహేష్ బాబు ఓవర్ నైట్ సూపర్ స్టార్ ని చేసింది. అయితే ఇదంతా గణపతి ఆశీస్సులతోనే జరిగింది అని చెప్పాలి. పోకిరి సినిమా ప్రారంభం అయ్యిందే ఈ బిట్ డ్యాన్స్ తో అట. అందుకే మహేష్ బాబుకి ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులు అందడంతో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ చిరకాలం గుర్తించుకునే బ్లాక్ బస్టర్ ని అందించాడు. ఈ సినిమాతో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మహేష్ బాబు ఇమేజిని మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఒకవేళ విగ్నేశ్వరుడికి మహేష్ బాబు అంతటి ప్రాముఖ్యత ఇచ్చి ఉండకపోయుంటే ఈ స్థాయి బ్లాక్ బస్టర్ ఆయనకీ అందేది కాదేమో. నేటి తరం లో ఏ హీరో చేయని పని చేయడంతో మహేష్ బాబు పై దేవుడు ప్రత్యేకమైన కృప చూపించాడు. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు అతి త్వరలోనే రాజమౌళి తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం లో గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఆశించిన స్థాయిలో అలరించలేదు. అభిమానులు ఆయన నుండి బలమైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి బ్లాక్ బస్టర్ రాజమౌళి మాత్రమే అందించగలడని మహేష్ బాబు అభిమానులు బలంగా నమ్ముతున్నారు.