Daku Maharaj : వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ తో కలిసి ‘డాకు మహారాజ్’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. వచ్చే నెల 12 వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అటు అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన గ్లిమ్స్ వీడియో కి, రెండు లిరికల్ వీడియో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే నిన్న ట్విట్టర్ లో బాలయ్య బాబు సీనియర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఒక స్పేస్ కి నిర్మాత నాగవంశీ విచ్చేశాడు.
ఈ స్పేస్ లో నాగ వంశీ ‘డాకు మహారాజ్’ చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఇంటర్వెల్ కి ముందు 20 నిమిషాల సన్నివేశం అభిమానులను చొక్కాలు చింపుకొని స్క్రీన్స్ ముందు గంతులు వేసేలా ఉంటుంది. ఆ 20 నిమిషాలు మీరంతా స్క్రీన్ పై పేపర్స్ చల్లుతూనే ఉంటారు. ఆ రేంజ్ లో వచ్చింది ఇంటర్వెల్ సీక్వెన్స్. బాలయ్య కెరీర్ లో ఎన్నో అద్భుతమైన ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాలు ఉన్నాయి. వాటిని అన్నిటిని బీట్ చేసే విధంగా ఈ ఇంటర్వెల్ సన్నివేశం ఉంటుంది. కేవలం బాలయ్య అభిమానులే కాదు, మాస్ ని ఇష్టపడే ప్రతీ మూవీ లవర్ ఆ 20 నిమిషాల సన్నివేశానికి మెంటలెక్కిపోతారు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు అభిమానుల్లో ఒక రేంజ్ నూతనోత్సాహాన్ని నింపింది. బాలయ్య ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ పడబోతోంది అని బలమైన నమ్మకాన్ని ఇచ్చాడు నిర్మాత నాగవంశీ.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 2వ తేదీన విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నందమూరి అభిమానుల ఆనందానికి అవధులే ఉండవని అంటున్నారు. అదే విధంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బాలయ్య బాబు ఎమ్మెల్యే గా పని చేస్తున్న హిందూ పురం లో నిర్వహించడానికి ప్లాన్స్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని దేశాల్లో మొదలయ్యాయి. కానీ ట్రేడ్ అంచనాలకు తగ్గట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. అక్కడి బయ్యర్స్ షెడ్యూల్ చేసిన షోస్ సంఖ్య కూడా చాలా తక్కువే. అయితే థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాకి హైప్ బాగా పెరిగి అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకుంటాయని అభిమానులు బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.