Srikanth son Roshan future: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ప్రస్తుతం స్టార్ హీరోల వారసుల సైతం ఇండస్ట్రీలో తమ సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. కృష్ణ కొడుకు మహేష్ బాబు, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ లాంటి నటులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక తన కొడుకు అయిన రోషన్ ను హీరోగా పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. 2021వ సంవత్సరంలో ‘పెళ్లి సందడి’ అనే సినిమాతో ఫుల్ టైమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక వెంటనే వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ కూతురు అయిన స్వప్న దత్ ప్రొడ్యూసర్ గా ‘ఛాంపియన్’ అనే సినిమాను అనౌన్స్ చేసింది. నాలుగేళ్ల విరామం తర్వాత రీసెంట్ గా ఛాంపియన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఇప్పుడు బడా నిర్మాత అయిన అల్లు అరవింద్ సైతం రోషన్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
మొత్తానికైతే రోషన్ బాలీవుడ్ హీరోలా చాలా ఫెయిర్ గా ఉండటమే కాకుండా ప్రేక్షకుడి యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా ఉన్నాడు. అలాగే నటన పరంగా కూడా చాలా ఔన్నత్యాన్ని సాధిస్తున్నాడు. అలాంటి నటుడి అవసరం ఇప్పుడు ఇండస్ట్రీకి ఉంది అని ప్రతి ఒక్కరూ కామెంట్లు చేస్తున్నారు.
ఎలాగైతే నట వారసులందరు స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారో రోషన్ సైతం స్టార్ హీరోగా ఎదుగుతాడా? పాన్ ఇండియాలో తన సత్తాను చాటగలిగే సినిమాలను చేస్తాడా? అనే ధరణిలో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కూడా రోషన్ మరోసారి తన సత్తా చాటుకుంటే మాత్రం స్టార్ హీరో అవుతాడు… లేకపోతే మాత్రం డీలా పడిపోవాల్సిన ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు చేయాల్సిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది…